IPL 2022: "దీపక్ భాయ్‌తో నిత్యం టచ్‌లో ఉంటా.. అతడు నాకు చాలా సాయం చేశాడు"

I am in touch with Deepak Chahar regularly says Mukesh Choudhary - Sakshi

ఐపీఎల్‌-2022లో సీఎస్‌కే యువ పేసర్‌ ముఖేష్‌ చౌదరి సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ముఖేష్‌ కీలక పాత్ర పోషించాడు. ఇక సీఎస్‌కే స్టార్‌ పేసర్‌ దీపక్‌ చహర్‌ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే చహర్‌ స్థానాన్ని ముఖేష్‌ భర్తీ చేశాడు. పవర్‌ప్లేలో ముఖేష్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. గతేడాది సీజన్‌లో సీఎస్‌కే నెట్‌ బౌలర్‌గా ముఖేష్‌ ఉన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముఖేష్‌  11 వికెట్లు పడగొట్టాడు.

ఇక తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను ముఖేష్‌ వెల్లడించాడు."దీపక్ భాయ్ గత కొంతకాలంగా సీస్‌కేకు ఆడుతున్నాడు. అదే విధంగా సీస్‌కేకు అద్బుతంగా రాణించాడు. నేను అతడితో నిత్యం టచ్‌లో ఉంటా టచ్‌లో ఉంటాను. అతడు నా బౌలింగ్‌ మెరుగుపరుచుకునేందుకు చాలా సలహాలు ఇస్తున్నాడు. పరిస్థితుల బట్టి ఎలా బౌలింగ్ చేయాలో అతడు నాకు చెప్పాడు.

టోర్నీ తొలి మ్యాచ్‌ల్లో నేను రాణించలేకపోయాను. దీపక్ భాయ్ నాకు ఫోన్ చేసి కొన్ని టిప్స్‌ చెప్పాడు.  నేను సన్‌రైజర్స్‌పై 4 వికెట్లు పడగొట్టినప్పడు.. చాహర్ నాకు ఫోన్‌ చేసి  ప్రశంసించాడు. అదే విధంగా ధోని భాయ్‌ సూచనలు పాటించమని చెప్పాడు. నిజంగా దీపక్ భాయ్ నాకు చాలా సహాయం చేశాడు. నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను, చాహర్‌ మాటలు నన్ను చాలా ప్రోత్సహించాయి" అని ముఖేష్‌ చౌదరి పేర్కొన్నాడు.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో ధావన్‌ అరుదైన ఫీట్‌.. కోహ్లి రికార్డు బద్దలు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top