IPL 2023: అంపైర్‌తో వాగ్వాదం.. హెన్రిచ్ క్లాసెన్‌కు బిగ్‌ షాక్‌! భారీ జరిమానా

Heinrich Klaasen, Amit Mishra Guilty Of IPL Code Of Conduct Breach - Sakshi

ఐపీఎల్‌-2023లో భాగంగా శనివారం ఉప్పల్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ ఓటమి పాలైంది. దీంతో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ప్లేఆఫ్‌ రేసు నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌ నిష్క్రమించింది. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్ క్లాసెన్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు క్లాసెన్‌కు మ్యాచ్‌ రిఫరీ జరిమానా విధించాడు.

అతడి మ్యాచ్‌లో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. క్లాసెన్‌ లెవెల్‌1 అత్రికమణకు పాల్పడ్డాడని, ఈ విషయంలో మ్యాచ్‌ రెఫరీదే తుది నిర్ణయమని ఐపీఎల్‌ నిర్వహకులు తెలిపారు.  ఈ మ్యా్చ్‌లో 29 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్‌ 47 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

మరోవైపు లక్నో స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రాకు కూడా  ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో ఎక్విప్‌మెంట్‌పై ప్రతాపం చూపించినందుకు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.

నో బాల్‌ వివాదం
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ల 19 ఓవర్‌  ఓవర్‌ ఆవేశ్‌ ఖాన్‌ వేశాడు. ఓవర్‌ మూడో బంతి హైఫుల్‌ టాస్‌గా వెళ్లింది. ఈ క్రమంలో ఫీల్డ్‌ అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించాడు. అయితే లక్నో కెప్టెన్‌ అంపైర్‌ కాల్‌ను చాలెంజ్‌ చేశారు. అయితే రిప్లేలో చూసిన  థర్డ్‌ అంపైర్‌ బంతి క్లియర్‌గా ఉందని.. నో బాల్‌ కాదని చెప్పాడు. నడుము పై నుంచి బంతి వెళ్లినప్పటికీ.. థర్డ్‌ అంపైర్‌ ఫెయిర్‌ డెలివరీగా ప్రకటించడం క్రీజులో ఉన్న సమద్‌, క్లాసెన్‌తో పాటు అభిమానులను షాక్‌కు గురిచేసింది.

ఈ క్రమంలో క్లాసెన్‌ లెగ్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అదే విధంగా ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు అయితే కాస్త అతి చేశారు. నట్టులు, మేకులు లక్నో డగౌట్‌పైన విసిరారు. దీంతో మ్యాచ్‌కు కాసేపు నిలిపివేశారు. కాగా అంపైర్‌తో వాగ్వాదానికి దిగినుందకే క్లాసెన్‌కు జరిమానా పడినట్లు తెలుస్తోంది.
చదవండి: #SunilGavaskarVsHCA: హెచ్‌సీఏను ఏకిపారేసిన సునీల్‌ గావస్కర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top