
Courtesy: IPL Twitter
అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ విజయానికి 2 బంతుల్లో 12 పరుగులు అవసరమైన దశలో తెవాటియా రెండు వరుస సిక్స్‌లు బాది జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అయితే గుజరాత్ ఇన్నింగ్స్ అఖరి ఓవర్‌లో విజయానికి 19 పరుగులు కావాలి. ఈ క్రమంలో బంతిని పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఓడియన్ స్మిత్‌కు అందించాడు.
స్మిత్ వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ మిస్ చేశాడు. అయితే బై రూపంలోనైనా పరుగు సాధించాలని మిల్లర్ అనుకున్నాడు. దీంతో నాన్ స్ట్రైకర్ వైపు పరిగెత్తాడు. నాన్ స్ట్రైకర్లో ఉన్న హార్దిక్ పాండ్యా కూడా వికెట్ కీపర్ వైపు పరిగెత్తాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో నేరుగా వికెట్లను గిరాటేశాడు. దీంతో కీలక దశలో హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు చేరాడు.
అయితే హార్దిక్ ఆ పరుగు కోసం అంత ఆసక్తి చూపించలేనట్టుగా అనిపించింది. దీంతో ఔటైన కోపంలో అసహానానకి గురైన హార్ధిక్.. మిల్లర్ వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.." ఏంటి హార్దిక్ ఔటయ్యాను అన్న కోపమా.. అలా అరుస్తున్నావు" కామెంట్ చేశాడు.
చదవండి: IPL 2022: వారెవ్వా తెవాటియా.. ధోని తర్వాత...
— Sam (@sam1998011) April 8, 2022