Hardik Pandya: అనుకోకుండా ఆల్‌రౌండర్‌ అయ్యాను.. అది నా అదృష్టం

Hardik Pandya: I Became An All Rounder By Chance - Sakshi

దుబాయి: భారత జట్టులో అత్యత్తమ ఆల్‌ రౌండర్‌ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లలో హార్దిక్ పాండ్యా కూడా ఉంటాడు. మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌తో కలిసి హార్దిక్ పాండ్యా ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో తన కెరీర్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పాండ్యా బయటపెట్టాడు. ‘‘నాకు గతంలో ఫాస్ట్ బౌలింగ్ చేయడానికి సరైన బూట్లు కూడా లేవు. నేను అనుకోకుండా ఆల్ రౌండర్ అయ్యాను’’ అని తెలిపాడు. ‘‘నేను 19 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆల్‌ రౌండర్‌గా మారాను. టీమిండియాకు ఆడే ముందు ఒక సంవత్సరం మాత్రమే బౌలింగ్ చేశాను హార్దిక్ చెప్పాడు. నేను మెదట బ్యాట్స్‌మెన్‌ని. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడిని. మొదటిసారిగా అండర్‌-19 మ్యాచ్‌ల్లో  బౌలింగ్‌ చేశాను’’ అని వివరించాడు.

ఈ మ్యాచ్‌లే తనను ఆల్‌రౌండర్‌గా మర్చాయని, ఇది తన అదృష్టమని చెప్పాడు. ‘‘శరత్ కుమార్ సార్ మా అండర్‌-19 ప్రాక్టీస్‌ను దూరం నుంచి ప్రతిరోజు గమనించేవారు. ఒక రోజు నేను కిరణ్ మోర్ అకాడమీ తరుపన ఓ మ్యాచ్‌లో పాల్గొన్నా.. ఆ మ్యాచ్‌లో ఓ ఫాస్ట్ బౌలర్ అందుబాటులో లేక పోవడంతో ఆనుహ్యంగా నాకు బౌలింగ్‌  చేసే అవకాశం దక్కింది.

కానీ ఆ సమయంలో ఫాస్ట్ బౌలింగ్ చేయడానకి  నా దగ్గర షూస్‌ లేవు..అయితే వేరే వాళ్లవి వేసుకుని నేను బౌలింగ్‌ చేశాను. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాను. ఈ ప్రదర్శరనే నా కెరియర్‌ ను మలుపు తిప్పింది. ఆ మ్యాచ్‌ చూసిన శరత్ కుమార్ సార్ ఒక నెల రోజుల్లోనే రంజీ ట్రోఫీకు నన్ను సెలక్ట్‌ చేశారని హార్దిక్ పాండ్యా చెప్పాడు. కాగా తాజాగా బీసీసీఐ ప్రకటించిన టి20 వరల్డ్‌ కప్‌ జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు.

చదవండి: T20 World Cup 2021: విండీస్‌ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top