‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ఇవానిసెవిచ్‌ | Goran Ivanisevic first Croatian in International Tennis Hall of Fame | Sakshi
Sakshi News home page

‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ఇవానిసెవిచ్‌

Jul 19 2021 2:35 AM | Updated on Jul 19 2021 2:35 AM

Goran Ivanisevic first Croatian in International Tennis Hall of Fame - Sakshi

ఫ్లోరిడా: క్రొయేషియా మాజీ టెన్నిస్‌ ప్లేయర్‌ ఇవానిసెవిచ్‌కు గొప్ప గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ఇవానిసెవిచ్‌కు చోటు లభించింది. ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న 49 ఏళ్ల ఇవానిసెవిచ్‌ ‘వైల్డ్‌ కార్డు’తో బరిలోకి దిగి 2001లో వింబుల్డన్‌ టోర్నీ టైటిల్‌ను గెలిచాడు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించా డు. ఇవానిసెవిచ్‌తోపాటు మాజీ నంబర్‌వన్‌ హెవిట్‌ (ఆస్ట్రేలియా), వింబుల్డన్‌ మాజీ విజేత కొంచిటా మార్టినెజ్‌ (స్పెయిన్‌)లకు ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో స్థానం దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement