breaking news
former player
-
30 ఏళ్లకే వీడ్కోలు.. ఊహించని ట్విస్ట్‌తో మాజీ చాంప్ రీఎంట్రీ!
మాజీ యూఎస్ ఓపెన్ చాంపియన్, ఆస్ట్రియా మాజీ టెన్నిస్ ప్లేయర్ డొమినిక్ థీమ్ మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టనున్నాడు. కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే 30 ఏళ్ల వయసులో థీమ్ అనూహ్యంగా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే రెండేళ్ల తర్వాత మాజీ చాంపియన్ రీఎంట్రీ ఇస్తున్నప్పటికీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఒకటి దాగుంది. అదేంటంటే థీమ్ ఈసారి టెన్నిస్ ప్లేయర్‌గా కాకుండా ఫుట్‌బాలర్‌గా అడుగుపెట్టనుండడమే!Photo Credit: Twitterఆస్ట్రియా ఫుట్‌బాల్ లీగ్‌లో డొమినిక్ థీమ్ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు. పలు నివేదికలు అందించిన సమాచారం మేరకు డొమినిక్ థీమ్ ఇప్పటికే ఆస్ట్రియాకు చెందిన అమెచ్యూర్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన బాడెనర్ ఏసీ తరఫున తన పేరును రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. టెన్నిస్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత తన హోమ్టౌన్ క్లబ్ ఎస్సీ లిచ్టెన్వర్త్ (బాడెనర్ క్లబ్లో జాయిన్ కాకముందు) తరఫున పది మ్యాచ్‌లు ఆడిన డొమినిక్ థీమ్ ఒక గోల్ కూడా చేయడం విశేషం. టెన్నిస్‌లో స్టార్ ఆటగాడి హోదా పొందినప్పటికీ, ఫుట్‌బాల్‌లో మాత్రం ఒక సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అందుకే అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫుట్‌బాల్ క్లబ్ కూడా ఇప్పటికీ డ్రెసింగ్ రూమ్‌లో ప్రత్యేక లాకర్ లేదా ఇతర సదుపాయాలు ఇవ్వలేదు.Photo Credit: Twitterవరుస గాయాలతో వీడ్కోలు..2020 యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన డొమినిక్ థీమ్ 2024లో టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటికీ 30 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న డొమినిక్ థీమ్ అనూహ్యంగీ వీడ్కోలు పలకడం వెనుక వరుస గాయాలు అతడిని ఇబ్బంది పెట్టడమే. 2020లో యూఎస్ ఓపెన్ గెలిచిన తర్వాత 2021లో ఏడుసార్లు మణికట్టు గాయానికి గురవ్వడంతో రెండేళ్ల పాటు ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది. Photo Credit: Twitterకెరీర్లో పీక్ ఫామ్‌లో ఉన్న సమయంలో వరుస గాయాలకు తోడు 2024లో యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే డొమినిక్ థీమ్ ఇంటిబాట పట్టాడు. దీంతో టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని ఆరోజే నిర్ణయం తీసుకున్నాడు. ఇక వియన్నా ఓపెన్‌లో తొలి రౌండ్లో ఇటలీకి చెందిన లూసియానో దార్దేరి చేతిలో రెండు సెట్లలోనే డొమినిక్ థీమ్ పరాజయం చవిచూశాడు. టెన్నిస్‌లో థీమ్‌కు ఇదే ఆఖరి మ్యాచ్ కావడం విశేషం. 30 ఏళ్ల వయసులో పీక్ ఫామ్‌లో ఉన్నప్పుడు వరుస గాయాలు ఇబ్బంది పెట్టడంతో టెన్నిస్‌ను వదిలేసిన డొమినిక్ థీమ్ రెండేళ్ల తర్వాత సరికొత్తగా మారి ఫుట్‌బాల్ ఆటలో అడుగుపెడుతున్నాడు. మరి ఫుట్‌బాల్‌లో డొమినిక్ థీమ్ మెరుస్తాడా లేదా అన్నది చూడాలి.చదవండి: ‘హ్యాండ్‌షేక్’ వివాదం.. రెండు నెలల తర్వాత నోరు విప్పిన హెడ్! -
‘జెయింట్స్’ హెడ్ కోచ్‌గా రేచల్ హేన్స్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో అత్యధిక మొత్తంతో టీమ్‌ను సొంతం చేసుకున్న అహ్మదాబాద్ యాజమాన్యం అందరికంటే వేగంగా, చురుగ్గా టీమ్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఈ టీమ్ ‘గుజరాత్ జెయింట్స్’కు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను ఇటీవలే మెంటార్‌గా ఎంపిక చేయగా, ఇప్పుడు టీమ్ హెడ్ కోచ్‌ను ప్రకటించింది. ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ రేచల్ హేన్స్ ‘జెయింట్స్’కు హెడ్ కోచ్‌గా వ్యవహరించనుంది. గత ఏడాదే ఆటకు గుడ్‌బై చెప్పిన హేన్స్ ఆసీస్ తరఫున ఆరు ప్రపంచకప్ విజయాల్లో భాగంగా ఉండటం విశేషం.ఆస్ట్రేలియా తరఫున ఆమె 6 టెస్టులు, 77 వన్డేలు, 84 టి20ల్లో ప్రాతినిధ్యం వహించింది. దీంతో పాటు మరో రెండు నియామకాలను కూడా అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఇటీవలే వరల్డ్‌కప్ నెగ్గిన భారత మహిళల అండర్–19 టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించిన నూషీన్ అల్ ఖదీర్‌ను బౌలింగ్ కోచ్‌గా... తుషార్ అరోథేను బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. గత ఏడాది మహిళల టి20 చాలెంజ్ టోర్నీ నెగ్గిన ‘సూపర్ నోవాస్’కు కోచ్‌గా పని చేసిన అనుభవం నూషీన్కు ఉండగా, బరోడా మాజీ క్రికెటర్ తుషార్ భారత సీనియర్ మహిళల టీమ్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. -
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇవానిసెవిచ్
ఫ్లోరిడా: క్రొయేషియా మాజీ టెన్నిస్ ప్లేయర్ ఇవానిసెవిచ్కు గొప్ప గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇవానిసెవిచ్కు చోటు లభించింది. ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న 49 ఏళ్ల ఇవానిసెవిచ్ ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగి 2001లో వింబుల్డన్ టోర్నీ టైటిల్‌ను గెలిచాడు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించా డు. ఇవానిసెవిచ్తోపాటు మాజీ నంబర్‌వన్ హెవిట్ (ఆస్ట్రేలియా), వింబుల్డన్ మాజీ విజేత కొంచిటా మార్టినెజ్ (స్పెయిన్)లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం దక్కింది. -
పాక్ క్రికెటర్‌కు 17నెలల జైలుశిక్ష
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ఓపెనర్ నాసిర్ జంషెడ్‌కు 17 నెలల జైలు శిక్ష ఖరారైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో తోటి క్రికెటర్లకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కారణంగా జెంషెడ్‌కు శిక్ష పడింది. గత డిసెంబర్లో 33 ఏళ్ల నాసిర్ జంషెడ్ తన నేరాన్ని అంగీకరించగా.. మాంచెస్టర్ క్రౌన్ కోర్టు శుక్రవారం 17 నెలల జైలు శిక్షను విధించింది. పాక్ సూపర్ లీగ్‌లో ప్లేయర్లుగా ఉన్న యూసెఫ్ అన్వర్, మొహమ్మద ఇజాజ్‌లు లీగ్‌లో సరైన ప్రదర్శన ఇవ్వకుండా ఉండేందుకు జెంషెడ్ వారికి ముడుపులు ఇవ్వచూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత డిసెంబర్ నెలలో నేషనల్ క్రైం ఏజెన్సీ ఈ ఫిక్సింగ్‌ను బట్టబయలు చేసింది. నేషనల్ క్రైం ఏజెన్సీ విచారణలో తమ నేరాలనునాసిర్ జంషెడ్, అన్వర్, ఇజాజ్‌లు అంగీకరించారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో కోర్టు ఈ ముగ్గురికి శిక్షను విధించింది. జెంషెడ్‌కు 17 నెలల జైలు శిక్ష పడగా.. అన్వర్‌కు 40 నెలలు, ఇజాజ్‌కు 30 నెలల శిక్ష పడింది. 2018 ఆగస్టులోనే పాక్ క్రికెట్ బోర్డు జెంషెడ్‌పై పదేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2016-17 సీజన్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నసీర్‌కు పీసీబీ పదేళ్ల నిషేధాన్ని విధించింది. నాసిర్ జంషెడ్ భార్య సమారా అఫ్జల్ స్పాట్ ఫిక్సింగ్ వార్తలపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'జంషెడ్ చర్యల కారణంగా మా కుటుంబానికి ఘోర అవమానం జరిగింది. ఇతర క్రికెటర్లను అవినీతికి పాల్పడమని చెప్పడం సమంజసం కాదు. జంషెడ్ కష్టపడి ఉంటే అతనికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేది. కానీ అతను షార్ట్ కట్ మార్గం ఎంచుకుని ప్రతిదీ కోల్పోయాడు. కెరీర్, హోదా, గౌరవం అన్ని నాశనం చేసుకున్నాడంటూ' ఆమె పేర్కొన్నారు. Today is the most difficult day of my life as Nasir starts his custodial sentence & I figure out what to tell my 4 year old.. I’ve felt the need to write this in the hope that others learn from Nasirs mistakes & no one goes through the pain we have suffered in the last 3 years. pic.twitter.com/fgkkMiglgz — Dr Samara Afzal (@SamaraAfzal) February 7, 2020 -
క్రీడలు మహిళలకు వరం
న్యూఢిల్లీ : క్రీడలు మహిళలను మానసికంగా దృఢంగా చేస్తాయని అంతర్జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారిణి జగ్మతి సంగ్వాన్ అన్నారు. ‘ఢిల్లీలో మహిళలు, క్రీడలు’ అన్న అంశంపై ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. ‘‘మహిళాసాధికారతలో క్రీడలు కీలక భూమిక పోషిస్తాయి, వ్యక్తిగత గుర్తింపునివ్వడమే కాదు... ఆత్మవిశ్వాసం పెరగడానికీ దోహదం చేస్తాయి’’ అని అభిప్రాయపడ్డారు జగ్మతి. 54 ఏళ్ల జగ్మతి మాజీ క్రీడాకారిణే కాదు... సామాజిక కార్యక్రమాల్లోనూ క్రియాశీలకంగా ఉంటారు. మహిళలు క్రీడారంగంలోకి రావడం ద్వారా వారి వ్యక్తిత్వంలో మార్పు రావడమే కాదు... సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు కూడా తగ్గుతాయన్నారామె. మహిళల పట్ల వివక్ష ఎక్కువగా ఉందని, తమ పిల్లలు చదువుకుని ఏదో ఓ ఉద్యోగంలో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులే కాదు... క్రీడాధికారులు సైతం మహిళా క్రీడాకారులపై సవతితల్లి ప్రేమ చూపుతారని ఆమె ఆరోపించారు. మరోవైపు ఎంత వివక్ష చూపినా, సవతితల్లి ప్రేమ ప్రదర్శించినా, మౌలిక సదుపాయాలు లేకపోయినా, అభద్రత ఉన్నా, క్రికెట్ తప్ప మిగిలినవన్నీ అసలు ఆటలే కాదన్నట్టుగా చూసినా... అన్నింటినీ అధిగమిస్తూ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి రస్‌ప్రీత్ సింధు, షూటర్ శ్రీయాంక సదంగి ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో తమ ప్రతిభ కనబరిచారు. ‘‘ఎందుకు అంతర్జాతీయ పోటీల్లో తరచూ ఓడిపోతుంటారు? అని ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. కానీ విదేశాల్లో క్రీడలకోసం, క్రీడాకారుల కోసం అక్కడి ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేస్తున్నాయి. మన దేశంలో ఉన్న పరిస్థితి ఏమిటి? అని వారికి ఎలా చెప్పగలం’’ అంటున్నారు అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి సింధు. ‘‘క్రీడాకారులకు కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి?ఉద్యోగం పరిస్థితి ఏమిటి? అనే ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడేవాళ్లకు మాత్రం గెలుపు మీదే లక్ష్యం ఉంటుంది. అందుకు కారణం ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యతే’’ అన్నారామె.


