శరత్‌ కమల్‌ గెలిచినా... గోవా చేతిలో చెన్నై ఓటమి | Goa Challengers Hunt Chennai Lions 9-6 In UTT 2024, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

UTT 2024: శరత్‌ కమల్‌ గెలిచినా... గోవా చేతిలో చెన్నై ఓటమి

Sep 1 2024 9:46 AM | Updated on Sep 1 2024 2:59 PM

Goa Challengers Hunt Chennai Lions 9-6 in UTT 2024

చెన్నై: అల్ట్‌మేట్‌లో టేబుల్‌ టెన్నిస్‌ (యూటీటీ) లీగ్‌లో గోవా చాలెంజర్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గోవా 9–6తో చెన్నై లయన్స్‌పై గెలుపొందింది. సొంతగడ్డపై శరత్‌ కమల్‌ 2–1 (11–6, 11–10, 6–11)తో మిహయి బొబోసికాపై గెలుపొందినప్పటికీ సహచరుల వైఫల్యంతో చెన్నైకి నిరాశ తప్పలేదు.

మహిళల సింగిల్స్‌లో సకుర మొరి 2–1 (11–9, 11–9, 9–11)తో యాంగ్జీ లియూ (గోవా)పై గెలిచి చెన్నై ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. కానీ తర్వాతి మ్యాచ్‌ల్లో చెన్నై ప్లేయర్లు వరుసగా ఓడిపోయారు. రెండో పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో హరి్మత్‌ దేశాయ్‌ (గోవా) 2–1 (6–11, 11–7, 11–5)తో జులెస్‌ రోలండ్‌పై గెలిచాడు. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శరత్‌–సకుర జోడీ 0–3 (9–11, 10–11, 7–11)తో హరి్మత్‌ దేశాయ్‌–యాంగ్లీ లియూ (గోవా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో మహిళల సింగిల్స్‌లో యశస్విని ఘోర్పడే (గోవా) 2–1 (11–5, 11–8, 3–11)తో మౌమ దాస్‌పై గెలుపొందడంతో చెన్నై ఓటమిపాలైంది. 

మరో పోరులో బెంగళూరు స్మాషర్స్‌ 9–6తో అహ్మదాబాద్‌ ఎస్‌జీ పైపర్స్‌పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ఆంథోని అమల్‌రాజ్‌ (బెంగళూరు) 1–2 (9–11, 10–11, 11–10)తో లిలియన్‌ బార్డెట్‌ చేతిలో, మహిళల సింగిల్స్‌లో మనిక బత్రా (బెంగళూరు) 1–2 (11–7, 9–11, 7–11)తో బెర్నడెట్‌ సాక్స్‌ చేతిలో కంగుతిన్నారు. 

తర్వాత మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ అల్వరొ రొబెల్స్‌–మనిక జోడీ 1–2 (3–11, 11–7, 8–11)తో మనుశ్‌ షా–బెర్నాడెట్‌ సాక్స్‌ జంట చేతిలో ఓడిపోయింది. ఈ దశలో పురుషుల సింగిల్స్‌లో అల్వరో రొబెల్స్‌ (బెంగళూరు) 3–0 (11–8, 11–7, 11–8)తో మనుశ్‌ షాపై, మహిళల సింగిల్స్‌లో లిలి జాంగ్‌ (బెంగళూరు) 3–0 (11–5, 11–8, 11–10)తో క్రిత్విక సిన్హా రాయ్‌లపై ఒక్క గేమ్‌ కూడా ఓడిపోకుండా గెలుపొందడంతో 
బెంగళూరు విజయం సాధించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement