French Open 2021: PV Sindhu Enters Semi-Finals, Lakshya Sen - Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సింధు

Oct 30 2021 5:15 AM | Updated on Oct 30 2021 9:52 AM

French Open 2021: PV Sindhu enters semi-finals - Sakshi

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధు 21–14, 21–14తో బుసానన్‌ ఒంగ్‌బామ్‌రంగ్‌ఫన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో సయాకా తకహాషి (జపాన్‌)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ (భారత్‌) 17–21, 15–21తో హెయో క్వాంగ్‌గీ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ 21–18, 18–21, 17–21తో ఆరోన్‌ చియా–సో వుయ్‌ యికి (మలేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది.

Advertisement
 
Advertisement
Advertisement