Former World Champion Olympic Winner Tori Bowie Dies At 32 - Sakshi
Sakshi News home page

ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్‌ అథ్లెట్‌.. 32 ఏళ్ల టో­రి బోవి హఠాన్మరణం 

Published Thu, May 4 2023 8:14 AM

Former World Champion Olympic Winner Tori Bowie Dies At 32 - Sakshi

ఫ్లోరిడా: ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్‌ మహిళా అథ్లెట్‌ టోరి బోవి (అమెరికా) హఠాన్మరణం చెందింది. ఫ్లోరిడాలోని ఆమె నివాసంలో విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఆమె మరణానికి గల కారణాలను ఇంకా వెల్లడి కాలేదు. కొంత కాలంగా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతోందని సమాచారం. 32 ఏళ్ల టోరి బోవి 2016 రియో ఒలింపిక్స్‌లో 4*100 మీటర్ల రిలేలో స్వర్ణం, 100 మీటర్లలో రజతం, 200 మీటర్లలో కాంస్య పతకం సాధించింది.

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో
2015 ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్లలో కాంస్యం నెగ్గిన ఆమె... 2017లో లండన్‌ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. అంతేకాకుండా 4*100 మీటర్ల రిలే పసిడి పతకం సొంతం చేసుకున్న అమెరికా జట్టులో సభ్యురాలిగా ఉంది.

లాంగ్‌జంప్‌లో నాలుగో స్థానం
డైమండ్‌ లీగ్‌ మీట్‌లో ఆమె నాలుగుసార్లు 100 మీటర్లలో, నాలుగుసార్లు 200 మీటర్లలో స్వర్ణ పతకాలను సాధించింది. 2019లో దోహా వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన టోరి బోవి 100 మీటర్ల విభాగంలో సెమీఫైనల్‌కు చేరినా ఆమె సెమీఫైనల్‌ రేసులో పోటీపడలేదు. ఈ మెగా ఈవెంట్‌లోనే ఆమె లాంగ్‌జంప్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆమె మరో అంతర్జాతీయ ఈవెంట్‌లో పోటీపడలేదు.  

చదవండి: PBKS Vs MI: 4 వికెట్లే కోల్పోయి 7 బంతులు ఉండగానే ఛేదన

Advertisement
Advertisement