భారత మాజీ క్రికెటర్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ కన్నుమూత | Former India cricketer Anshuman Gaekwad passes away | Sakshi
Sakshi News home page

విషాదం: కేన్సర్‌తో చికిత్స పొందుతూ మాజీ క్రికెటర్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ కన్నుమూత

Aug 1 2024 6:46 AM | Updated on Aug 1 2024 8:39 AM

Former India cricketer Anshuman Gaekwad passes away

టీమిండియా మాజీ క్రికెటర్, హెడ్‌ కోచ్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. 

గైక్వాడ్‌ కేన్సర్‌ చికిత్సకు సంబంధించి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఆదుకోవాలని బీసీసీఐకి దిగ్గజ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ఈ మధ్యే విన్నవించిన సంగతి తెలిసిందే. స్పందించిన బీసీసీఐ గైక్వాడ్ చికిత్సకు తక్షణం సాయం కింద రూ.కోటి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈలోపే ఆయన కన్నుమూశారు.  

గైక్వాడ్‌ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. క్రికెట్‌కు గైక్వాడ్‌ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తను మరణించారన్న వార్త బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రధాని సానూభూతి ప్రకటించారు. బీసీసీఐ కార్యదర్శి జైషాతో, మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీతో పాటు పలువురు క్రికెటర్లు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.    

 

 అన్షుమన్‌ గైక్వాడ్‌ 1974-87 మధ్య భారత జట్టు తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. మొత్తం 2,254 పరుగులు చేశారు. వాటిలో రెండు శతకాలు ఉన్నాయి. 1983లో జలంధర్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 201 పరుగులు చేశాడు. రెండుసార్లు టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా పనిచేశాడు.  అంతకు ముందు నైంటీస్‌లో ఆయన జాతీయ టీమ్‌ సెలెక్టర్‌గా,  ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగానూ పనిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement