Suryakumar Yadav: ఈ మూడు మ్యాచ్‌లను మర్చిపో సూర్య.. ఐపీఎల్‌లో బాగా ఆడు!

Forget these 3 matches and focus on the IPL: Sunil Gavaskar - Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డేల్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడింట్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌ యాదవ్‌పై తీవ్ర విమర్శలు వర్షం కురుస్తోంది. అతడు వన్డేలకు పనికిరాడని, జట్టు నుంచి వెంటనే తొలిగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సూర్యకు కొంతమంది మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు.

                          

తాజాగా భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా సూర్యకు సపోర్ట్‌గా నిలిచాడు. ఆసీస్‌ సిరీస్‌ను మర్చిపోవాలి అని,రాబోయే ఐపీఎల్   సీజన్‌పై దృష్టి సారించాలని గవాస్కర్ సూచించాడు. "క్రికెట్‌ కెరీర్‌లో ఏ ఆటగాడైనా ఇటువంటి పరిస్ధితులను ఎదుర్కొవడం సహజం. ఆ విషయాన్ని సూర్య అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు సూర్య చేయాల్సిన పని ఒక్కటే. ఈ మూడు మ్యాచ్‌లను ఒక పీడ కలలా మర్చిపోయి, త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌పై దృష్టి పెట్టాలి.

ఐపీఎల్‌లో పరుగులు సాధిస్తే..సూర్య తన ఫామ్‌ను తిరిగి పొందుతాడు. అయితే ఈ సిరీస్‌లో అతడు మొదటి బంతికే 3 సార్లు ఔట్ అయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుతమైన బంతులతో  మిచెల్ స్టార్క్.. సూర్యను పెవిలియన్‌కు పంపాడు. కానీ మూడో వన్డేలో మాత్రం సూర్య కొంచెం జాగ్రత్తగా ఆడి ఉంటే బాగుండేంది. ఎందుకుంటే సూర్య ఔటైన డెలివరి అంత గొప్పది ఏమి కాదు" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు.
చదవండిIND vs AUS: అతడి వికెటే మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌.. లేదంటేనా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top