
విశ్వక్రీడల్లో పోటీపడిన తొలి భారత ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవి తనకు టోక్యో ఒలింపిక్స్ చక్కని పాఠాలు నేర్పిందని తెలిపింది. ‘రియో ఒలింపిక్స్ అనంతరం కష్టపడితేనే టోక్యో అవకాశం దక్కింది. ఇకపై మరింతగా చెమటోడ్చితేనే భవిష్యత్తులో రాణించవచ్చు. çముఖ్యంగా నేను నా టెక్నిక్‌ను మెరుగు పర్చుకోవాలి. నా ఆటతీరును సమీక్షించుకున్నాక అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకుంటాను’ అని 27 ఏళ్ల భవానీ వివరించింది.