ఆసీస్‌తో సిరీస్‌ : అసలైన హీరో అతనే

Fans Thank Rahul Dravid For Coaching Younger Players After Gabba Test  - Sakshi

శుబ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, టి. నటరాజన్‌, నవదీప్‌ సైనీ.. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాల్గొన్నావారే. టీమిండియా ఈరోజు సిరీస్‌ గెలవడంలో వీరి పాత్ర కూడా ఉందనడంలో సందేహం లేదు. రిషబ్‌ పంత్‌ నుంచి మొదలుకొని నటరాజన్‌ వరకు అందరూ ఏదో ఒక సమయంలో తమ ప్రతిభను చాటారు. కానీ వీరి రాణింపు వెనుక అసలు కారణం ఎవరో తెలుసా.. ది గ్రేట్‌వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. అవును మీరు విన్నది నిజమే.. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ద్రవిడ్‌ ఇండియా ఏ, అండర్‌ -19 టీమ్‌లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సమయంలోనే ఎందరో యువ ఆటగాళ్లకు తన విలువైన సలహాలిస్తూ మార్గనిర్దేశనం చేశాడు.చదవండి: పాపం లాంగర్‌.. ఓడిపోయాకా తెలిసొచ్చినట్లుంది

అలా 2016 నుంచి 2019 వరకు చూసుకుంటే..  గిల్‌, పంత్‌, సుందర్‌.. ఇలా ఎవరు చూసుకున్నా ద్రవిడ్‌ పర్యవేక్షణలోనే రాటుదేలారు. అందుకే ఈరోజు ఆసీస్‌ గడ్డపై సీనియర్‌ ప్లేయర్ల గైర్హాజరీలో కుర్రాళ్లతోనే టీమిండియా మంచి ప్రతిభను కనబరిచి టెస్ట్‌ సిరీస్‌ను ఎగురేసుకుపోయింది. దీంతో ట్విటర్‌ వేదికగా రాహుల్‌ ద్రవిడ్‌కు అభిమానులు తమదైన శైలిలో థ్యాంక్స్‌ చెప్పుకున్నారు. 'ఆట నుంచి రిటైరైన తర్వాత కూడా సేవలందిస్తున్న ద్రవిడ్‌కు ఇవే మా సెల్యూట్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ కమిన్స్‌ కావొచ్చు.. కానీ మా దృష్టిలో మాత్రం రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రమే రియల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌.. ఇంతమంది యంగ్‌ టాలెంటెడ్‌ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేసిన ద్రవిడ్‌ అసలైన హీరో..' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ద్రవిడ్‌కు సంబంధించిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నాయి. చదవండి: 32 ఏళ్ల జైత్రయాత్రకు టీమిండియా చెక్

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top