Fans React Afghan Beautiful-Girl Shares Photo Will Attend IND Vs AFG - Sakshi
Sakshi News home page

Asia Cup IND Vs AFG: టీమిండియాతో అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌.. కళ్లన్నీ ఆ యువతిపైనే!

Sep 1 2022 5:05 PM | Updated on Sep 1 2022 6:56 PM

Fans React Afghan Beautiful-Girl Shares Photo Will Attend IND Vs AFG - Sakshi

ఆసియాకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌ జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది. లీగ్‌ దశలో శ్రీలంక, బంగ్లాదేశ్‌పై సంచలన విజయాలు నమోదు చేసిన అఫ్గానిస్తాన్‌ సూపర్‌-4కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ విషయం పక్కనబెడితే.. అఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఒక అందమైన యువతి హాజరైంది. ఆమె అందానికి ఆరోజు స్టేడియానికి వచ్చిన వారితో పాటు టీవీల్లో మ్యాచ్‌ చూసినవారు కూడా ఫిదా అయ్యారు.

అంతగా కుర్రకారు మనసులు దోచుకున్న ఆ యువతి పేరు వాజ్మా అయూబీ. అఫ్గానిస్తాన్‌ అభిమాని అయిన వాజ్మా బౌండరీ లైన్‌ వద్ద అఫ్గాన్‌ జెండా పట్టుకొని ఆటగాళ్లతో పాటు వీక్షకులను తన అందరంతో కట్టిపడేసింది.  కాగా మ్యాచ్‌ గెలిచిన తర్వాత అఫ్గానిస్తాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. కంగ్రాట్స్‌ బ్లూ టైగర్స్‌ అంటూ వాజ్మా ఆయూబీ తన ట్విటర్‌లో పేర్కొంది.  అంతే ఆమె ఫోటో క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఇది చూసిన కొంతమంది టీమిండియా అభిమానులు కూడా వాస్మా ఆయూబీ అందానికి ముగ్దులై.. ''టీమిండియా, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌కు కూడా వస్తారా..'' అంటూ కామెంట్‌ చేయడం విశేషం.  అలా వాజ్మా ఆయూబీ తన అందంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. టీమిండియా, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌కు ఆమె వస్తుందో లేదో తెలియదు కానీ.. ఒకవేళ వాజ్మా హాజరైతే మాత్రం అందరి కళ్లు ఆమెవైపు ఉంటాయని మాత్రం చెప్పొచ్చు.

ఇక బుధవారం హాంకాంగ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూఫ్‌ టాపర్‌గా సూపర్‌-4లోకి అడుగుపెట్టింది. మంగళవారం(సెప్టెంబర్‌ 6న)  టీమిండియా.. అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. అంతకముందే.. అన్ని సక్రమంగా జరిగితే ఈ ఆదివారం(సెప్టెంబర్‌ 4న) చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మరోసారి తలపడే అవకాశముంది. అయితే పాకిస్తాన్‌ సూపర్‌-4కు అర్హత సాధించాలంటే శుక్రవారం హాంకాంగ్‌తో మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement