IPL 2022 - Hardik Pandya: 'నీ బౌలింగ్‌ వల్ల ఒరిగేదేం లేదు'.. హార్దిక్‌ను ఏకిపారేసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌

Fans Counter Attack Hardik Pandya Cheeky Reply To Journalist Query - Sakshi

ఐపీఎల్‌ కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ ఇటీవలే తమ జెర్సీని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, హెడ్‌కోచ్‌ ఆశిష్‌ నెహ్రా, బీసీసీఐ కార్యదర్శి జై షా.. జట్టు ఇతర అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.ఇక జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడాడు. సమావేశంలో భాగంగా బౌలింగ్‌ చేస్తారా లేదా అని జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు పాండ్యా బదులిస్తూ.. ‘‘సర్‌.. అది సర్‌ప్రైజ్‌.. సర్‌ప్రైజ్‌లాగే ఉండనివ్వండి’’ అంటూ సమాధానం దాటవేశాడు.

ఇప్పుడు ఈ సమాధానమే పాండ్యా కొంపముంచింది. పాండ్యా బౌలింగ్‌ చేయాలా వద్దా అన్న దానిపై అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఏకిపారేశారు.''పాండ్యా ఏదో గ్రేట్‌ బౌలర్‌లా ఫీలవుతున్నాడు. ఆల్‌రౌండర్‌ అని చెప్పుకుంటున్న హార్దిక్‌ పాండ్యా తన బౌలింగ్‌ను దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌తో పోల్చుకుంటున్నాడు'' అని ఒక అభిమాని ట్వీట్‌ చేశాడు. ''నువ్వు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ స్టార్క్‌వి మాత్రం కాదు బ్రో.. నీ బౌలింగ్‌ చూడడం వల్ల మాకు ఒరిగేదేం లేదు''.. ''అందులో సర్‌ప్రైజ్‌ ఏముంది.. బౌలింగ్‌ వేస్తావా.. వేయవా అనేదానికి అవును.. కాదు అనే సమాధానం ఇస్తే సరిపోయేదిగా..'' అంటూ ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. 

ఇక ప్రస్తుతం హార్దిక్‌ పాండ్యా బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో ఉన్నాడు. ఫిట్‌నెస్‌ టెస్టులో క్లియరెన్స్‌ వస్తేనే హార్ధిక్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో బౌలింగ్‌ వేసే అవకాశముంది.కాగా గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్‌ పాండ్యాను మెగా వేలానికి ముందే 15 కోట్లు చెల్లించి గుజరాత్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

చదవండి: గుజరాత్‌ టైటాన్స్‌ జెర్సీ ఆవిష్కరణ.. సర్‌ప్రైజ్‌కు సిద్ధంగా ఉండాలన్న కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా

Lewis Hamilton: పేరు మార్చుకోనున్న స్టార్‌ ఆటగాడు.. కారణం?

46 ఏళ్ల వయసులో సెంచరీ.. ముద్దుల్లో ముంచిన ఫేమస్‌ హీరోయిన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top