ENG Vs SA 2022: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌!

England announce 14 player squad for first two Tests against South Africa - Sakshi

దక్షిణాఫ్రికాతో తొలి రెండు టెస్టులకు  14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఇక గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న పేసర్‌ ఓలీ రాబిన్సన్‌ను ఈ సిరీస్‌కు ఇంగ్లండ్‌ సెలక్టర్లు ఎంపిక చేశారు. రాబిన్సన్‌ చివరగా ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాపై ఆడాడు. అదే విధంగా కొవిడ్‌ కారణంగా న్యూజిలాండ్‌తో అఖరి రెండు టెస్టులకు దూరమైన వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ కూడా ఈ సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు.

దీంతో వికెట్‌ కీపర్‌ సామ్‌ బిల్లింగ్స్‌ వేటు పడింది. ఇక ఆస్ట్రేలియాతో యాషెస్‌ సిరీస్‌లో ఘోర పరాభావం, విండీస్‌ పర్యటనలో ఓటమి చవిచూసిన తర్వాత ఇంగ్లండ్‌ టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తోంది. నూతన కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ నేతృత్వంలో ఇంగ్లండ్‌ జట్టు విజయాలతో దూసుకుపోతుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసిన ఇంగ్లండ్‌.. భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులోను తమ జోరును కొనసాగించింది. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్‌ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఇరు జట్లు మధ్య లార్డ్స్‌ వేదికగా ఆగస్టు17 జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

దక్షిణాఫ్రికాతో టెస్టులకు ఇంగ్లండ్‌ జట్టు: 
బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, బెన్ ఫోక్స్ (వికెట్‌ కీపర్‌), జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్‌టన్, మాథ్యూ పాట్స్, ఆలీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్.
చదవండి:
 Rohit Sharma Retired-Hurt: రోహిత్‌ శర్మ రిటైర్డ్‌ హర్ట్‌.. బీసీసీఐ కీలక అప్‌డేట్‌.. ఆసియా కప్‌కు దూరమయ్యే చాన్స్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top