
భారత్‌లో అత్యంత పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌గా పేరొందిన డ్యూరాండ్ కప్ నుంచి హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. కోల్‌కతాలో జరుగుతున్న ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టు గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో 1–2తో ఆర్మీ రెడ్ జట్టు చేతిలో ఓడిపోయింది. నిర్ణీత మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ ఒక విజయం, రెండు ఓటములతో తమ గ్రూప్‌లో మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
చదవండి: CSK vs MI: గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్.. చెన్నైదే పైచేయి