హ్యూమా ఖురేషీతో కలిసి చిందేసిన టీమిండియా కెప్టెన్‌

Double XL: Shikhar Dhawan Dances With Huma Qureshi In His Debut Film - Sakshi

దక్షిణాఫ్రికాతో జరగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శిఖర్‌ ధవన్‌ బాలీవుడ్‌ ఎంట్రీ కన్ఫర్మ్‌ అయ్యింది. టీ-సిరీస్ సంస్థ నిర్మిస్తున్న డబుల్‌ ఎక్సెల్‌ సినిమాతో గబ్బర్‌ సినిమాల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. 

చిత్ర కధానాయికల్లో ఒకరైన హ్యూమా ఖురేషీ.. గబ్బర్‌తో కలిసి రొమాంటిక్‌ డ్యాన్స్‌ చేస్తున్న సీన్‌ను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. క్యాట్‌ ఈజ్‌ ఔట్‌ ఆఫ్‌ ది బ్యాగ్‌... ఫైనల్లీ అంటూ శిఖర్‌ ధవన్‌ను ట్యాగ్‌ చేస్తూ క్యాప్షన్‌ జోడించింది. ఈ పోస్ట్‌ క్రికెట్‌ అభిమానులతో పాటు బాలీవుడ్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. 

సినిమా విషయానికొస్తే.. సత్రమ్ రమణి దర్శకత్వంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న డబుల్‌ ఎక్సెల్‌ చిత్రం అధిక బరువు అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులు కాగా.. గబ్బర్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలోని పాత్రల కోసం హ్యూమా, సోనాక్షి భారీగా బరువు పెరిగారు. డబుల్‌ ఎక్సెల్‌ తెలుగులో ఆనుష్క నటించిన సైజ్‌ జీరోకు దగ్గరగా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top