Australia Open 2022: జకోవిచ్‌కు కరోనా..!

Djokovic Got Vaccine Exemption As He Had Covid Infection Says His Lawyers - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2022లో పాల్గొనేందుకు మెల్‌బోర్న్‌కు వచ్చిన ప్రపంచ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు నొవాక్‌ జకోవిచ్‌ను కోవిడ్‌ టీకాలు తీసుకోని కారణంగా టోర్నీలో ఆడనిచ్చేదిలేదని అక్కడి ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో.. జకో తరపు లాయర్లు ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. గతేడాది డిసెంబర్‌ 16న జకోకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, అందుకే అతను వ్యాక్సిన్‌ వేసుకునేందుకు మినహాయింపు కోరాడని, టోర్నీ నిర్వాహకులు అందుకు మినహాయింపు ఇస్తేనే జకో మెల్‌బోర్న్‌కు వచ్చాడని లాయర్లు వాదిస్తున్నారు.

కాగా, కోవిడ్‌ టీకా వేసుకోకపోవడమే కాకుండా సరైన పత్రాలు చూపలేదన్న కారణంగా మెల్‌బోర్న్‌ విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు జకోను డెటెన్షన్‌ సెంటర్‌లో ఉంచి, వీసాను రద్దు చేసిన సంగతి తెలిసిందే.  ఈ విషయమై జకోవిచ్‌ నాయపోరాటం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే అతని తరపు లాయర్లు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈ విషయమై సోమవారం కోర్టు తీర్పు వెల్లడించనుంది.
చదవండి: అందుకే వచ్చాను... మరి ఇప్పుడేంటి ఇలా: జొకోవిచ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top