Dhoni Invested Company Cars24 Signs Up as Title Sponsor for Sunrisers Hyderabad in IPL 2022 - Sakshi
Sakshi News home page

IPL 2022: ఎస్‌ఆర్‌హెచ్‌లో ధోని పెట్టుబడులు.. ఈ ఏడాది నుంచే షురూ..!

Jan 30 2022 3:43 PM | Updated on Jan 30 2022 5:38 PM

Dhoni Invested Company Cars24 Signs Up As Title Sponsor For Sunrisers Hyderabad In IPL 2022 - Sakshi

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు సారధ్యం వహిస్తున్న ఎంఎస్‌ ధోని.. ప్రత్యర్ధి జట్టైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాడన్న వార్త ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. నిషేధం సమయంలో పూణేకు ఆడటం మినహా లీగ్‌ ఆరంభం నుంచి సీఎస్‌కేకు మాత్రమే ఆడుతూ వస్తున్న ధోని.. మరో జట్టులో పెట్టుబడులు పెట్టడమేంటని అతని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ధోని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎస్‌ఆర్‌హెచ్‌లో భాగమయ్యాడని తెలిసి అవాక్కవుతున్నారు. 

వివరాల్లోకి వెళితే.. 2015 నుంచి ‘కార్స్ 24’ అనే సంస్థలో ధోనికి పెట్టుబడులున్నాయి. ఈ సంస్థకు ధోనియే బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ సంస్థే ఈ ఏడాది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టైటిల్‌ స్పాన్సర్షిప్‌ హక్కులు దక్కించుకుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. దీంతో ధోని ఎస్‌ఆర్‌హెచ్‌లో పెట్టుబడులు పెడుతున్నాడని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. 

కాగా, గతేడాది ఐపీఎల్‌ వరకు ‘జెకె లక్ష్మీ’ సంస్థ ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రంట్ జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్‌ సహా పలు జట్లు ఇదివరకు ఉన్న జెర్సీ స్పాన్పర్లను మార్చి కొత్త సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకున్నాయి. ముంబై ఇండియన్స్ సామ్సంగ్‌ను వదులకుని స్లైస్ వైపు మొగ్గు చూపగా, చెన్నై సూపర్‌కింగ్స్ టీవీఎస్ యూరోగ్రిప్‌తో జత కట్టింది. 
చదవండి: ప్రపంచకప్‌ మ్యాచ్‌ జరుగుతుండగా భూకంపం.. విషయం తెలియక..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement