నాలుగో టీ20లో సౌతాఫ్రికా చిత్తు.. సిరీస్ న్యూజిలాండ్ సొంతం | Devine stars with the bat again as New Zealand seal T20I series | Sakshi
Sakshi News home page

NZ vs SA: నాలుగో టీ20లో సౌతాఫ్రికా చిత్తు.. సిరీస్ న్యూజిలాండ్ సొంతం

Mar 22 2026 2:08 PM | Updated on Mar 22 2026 3:49 PM

Devine stars with the bat again as New Zealand seal T20I series

వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మహిళలతో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

ప్రోటీస్ ఆల్‌రౌండర్ అనేరీ డెర్క్సెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 32 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసింది. ఆమెతో పాటు లాస్ 30 పరుగులతో రాణించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 3 వికెట్లతో అదరగొట్టింది. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీలియా కేర్ 31 పరుగులతో రాణించింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లో ట్రయాన్ 2 వికెట్లు తీసింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20 క్రైస్ట్‌చర్చ్ వేదికగా మార్చి 25న జరగనుంది.
చదవండి: IPL 2026: '250 స్కోర్ కొట్టినా.. స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోతుంది'
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement