'250 స్కోర్ కొట్టినా.. స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోతుంది' | Aakash Chopra on the SunRisers Hyderabads challenges heading into IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: '250 స్కోర్ కొట్టినా.. స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోతుంది'

Mar 22 2026 1:48 PM | Updated on Mar 22 2026 2:09 PM

Aakash Chopra on the SunRisers Hyderabads challenges heading into IPL 2026

ఐపీఎల్‌-2026 సీజన్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. గత సీజన్‌లో కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఈసారి మాత్రం ఛాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆరెం‍జ్ ఆర్మీ తమ హోం గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది.

అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడం ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. వెన్ను గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్ సీజన్ మధ్యలో ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో చేరే అవకాశముంది. దీంతో అప్పటివరకు సన్‌రైజర్స్ జట్టును స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నడిపించనున్నాడు. మరోవైపు గత సీజన్‌లో దుమ్ములేపిన శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగ అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొం‍ది.

అంతేకాకుండా వేలంలో కొన్న బౌలింగ్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. దీంతో ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ను బౌలింగ్ కష్టాలు వెంటాడడం ఖాయం. ఎందుకంటే ప్రస్తుత ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో హర్షల్ పటేల్‌, జయదేవ్ ఉనద్కట్ తప్ప చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్ అంటూ లేరు.

ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు బౌలింగ్ అతి పెద్ద సవాలుగా మారనుందని అతడు అభిప్రాయపడ్డాడు.

"కమ్మిన్స్‌, మలింగ లేకపోవడంతో ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగం చాలా వీక్‌గా కన్పిస్తోంది. కచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయి. బ్రైడన్ కార్స్ జట్టులో ఉన్నప్పటికి ఉపఖండ పిచ్‌లపై అతడికి అనుభవం లేదు. అలా అని కేవలం భారత బౌలర్లతో ఆడడం చాలా ప్రమాదకరం. జట్టులో అమిత్ కుమార్, ప్రఫుల్ హింజ్, సాకిబ్ హుస్సేన్, ఓంకర్ తర్మాలే, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్ హర్ష్ దూబే వంటి యువ బౌలర్లు ఉన్నారు.

హర్షల్ పటేల్‌, జయదేవ్ ఉనద్కట్‌కు మాత్రమే ఎక్కువ ఆడిన అనుభవం ఉంది. ఈ బలహీనమైన బౌలింగ్ లైనప్‌తో ఎస్‌ఆర్‌హెచ్ ఎలా మేనెజ్‌చేస్తోందో ఆర్ధం కావడం లేదు. ఒకవేళ బ్యాటర్లు 250 పరుగులు చేసినా, బౌలర్లు ఆ టోటల్‌ను డిఫెండ్ చేసుకునేలా లేరు" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లలో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026: వేలంలో అన్‌సోల్డ్‌.. కట్ చేస్తే! ఇప్పుడు కేకేఆర్‌లోకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement