ఈసారి 'వినయ విధేయ వార్నర్‌'లా..

David Warner Kills It As Ram Charan Teja In His Latest Insta Avatar - Sakshi

మెల్‌బోర్న్‌: తెలుగు హీరోలను, సినిమాలను క్రమం తప్పకుండా ఫాలో అవుతూ, వారి ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తూ తరుచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌.. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ను వాడేశాడు. రాంచరణ్‌, కియారా అడ్వానీ నటీనటులుగా నటించిన వినయ విధేయ రామ సినిమాలోని యాక్షన్‌ సీన్లతో స్వాపింగ్‌ వీడియో రూపొందించి, తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేశాడు. నేను మళ్లీ వచ్చేశాను. ఈ లెజెండ్‌ ఎవరు? ఇది ఏ సినిమాలో సన్నివేశం అని క్యాప్షన్‌ జోడించాడు. ఈ పోస్టుకు హీరోలు రాంచరణ్‌, రానా దగ్గుబాటి, ప్రభాస్‌లను ట్యాగ్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుత నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. దీనిపై రాంచరణ్‌ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.

కాగా, బుట్టబొమ్మ సాంగ్‌తో స్వాపింగ్‌ వీడియోలను రూపొందించడం ప్రారంభించిన ఈ ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌.. ఆతర్వాత చాలా మంది తెలుగు అగ్ర హీరోలకు చెందిన సినిమాల్లోని సీన్లతో వీడియోలు చేశాడు. ఇటీవలే రాజమౌళీ ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టర్‌ను మార్ఫింగ్‌ చేసిన వార్నర్‌.. దానికి వచ్చిన రెస్పాన్స్‌ చూసి వినయ విధేయ రామను వాడాడు. ఈ మధ్యకాలంలో పేస్ ఆఫ్ యాప్‌ను ఉప‌యోగించి సౌత్‌ స్టార్స్ సినిమాల్లోని స‌న్నివేశాల్లో నటిస్తున్న డేవిడ్‌ భాయ్‌.. కొంతకాలంగా ఇలాంటి ప్రయోగాలనే చేస్తూ బీజీగా గడుపుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ రద్దు కావడంతో ఖాళీగా ఉన్న వార్నర్‌.. ఎక్కువ శాతం సమయాన్ని మార్ఫింగ్‌ వీడియోలు చేయడానికి కేటాయించడం విశేషం. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top