స్మిత్‌వి అన్ని చిన్నపిల్లల బుద్ధులే

లండన్: టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్.. రిషబ్ పంత్ గార్డ్ మార్క్‌ను చెరిపేసిన ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. స్మిత్ పనిని పలువురు మాజీ ఆటగాళ్లు తప్పుబడితే ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ మాత్రం అతనికి మద్దతుగా నిలిచాడు. అంతేగాక వీడియోతో అడ్డంగా దొరికిపోయినా కూడా స్మిత్ తాను చేసింది తప్పు కాదని.. ఇది నాకు అలవాటేనని.. మ్యాచ్ గురించి ఆలోచించకుండా ఇలాంటి పనికిమాలిన వాటిపై ఎందుకు దృష్టి పెడతారంటూ తనను తాను సమర్థించుకోవడం విశేషం. తాజాగా స్మిత్ చర్యపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ స్పందించాడు.(చదవండి: ఇదంతా ఐపీఎల్ వల్లే జరిగింది)
'స్టీవ్ స్మిత్‌వి అన్ని చిన్నపిల్లల బుద్దులే. అతను చేసింది తప్పు అని తెలిసినా కూడా దానిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. రిషబ్ పంత్ గీసుకున్న గార్డ్ మార్క్‌ను చెరిపేయడమే గాక దానిని నేను కావాలని చేయలేదంటూ సమర్థించుకోవడం స్మిత్‌కు మాత్రమే చెల్లింది. మైదానంలో కెమెరాలు ఉంటాయన సంగతి మరిచి బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్‌కు గార్డ్ మార్క్ చెరిపేయడం ఒక లెక్క కాకపోవచ్చు. ఒకవేళ ఆ సమయంలో అక్కడ నేను అంపైర్‌గా విధులు నిర్వర్తించి ఉంటే స్మిత్ చర్యను తప్పుబడుతూ కెప్టెన్ దృష్టికి తీసుకొచ్చేవాడిని' అంటూ చెప్పుకొచ్చాడు.(చదవండి: ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి