Cristiano Ronaldo Says He Feels Betrayed By Manchester United, Know Details - Sakshi
Sakshi News home page

Cristiano Ronaldo: 'ద్రోహం చేశారు'.. రొనాల్డో సంచలన వ్యాఖ్యలు

Nov 14 2022 10:48 AM | Updated on Nov 17 2022 3:50 PM

Cristiano Ronaldo Says He-Feels-Betrayed-By Manchester United  - Sakshi

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తో పాటు జట్టు మేనేజర్‌ ఎరిక్‌ టెన్‌ హాగ్‌లు నాకు ద్రోహం చేశారంటూ పేర్కొన్నాడు. పియర్స్‌ మోర్గాన్‌ బ్రాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో ఈ వ్యాఖ్యలు చేశాడు.

విషయంలోకి వెళితే.. గత నెలలో టోటెన్‌హమ్‌తో మ్యాచ్‌ సందర్భంగా రొనాల్డోనూ సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లాలని మేనేజర్‌  టెన్‌ హగ్‌ పేర్కొన్నాడు. కానీ రొనాల్డో సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో టెన్‌ హగ్‌  రొనాల్డోను జట్టు నుంచి తప్పించాడు. ఆ తర్వాత చెల్సియా ట్రిప్‌కు రొనాల్డోను ఎంపిక చేయలేదు. అయితే దీని వెనుక కూడా టెన్‌ హగ్  హస్తం ఉన్నట్లు తెలిసింది. అప్పటినుంచి రొనాల్డో, టెన్‌ హగ్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. తాజాగా పియర్స్‌ మోర్గాన్‌ ఇంటర్య్వూలోనూ రొనాల్డో ఇదే విషయాన్ని పేర్కొన్నాడు.

''వాళ్ల విషయంలో మోసం అనే పదం చాలా చిన్నది. ఎరిక్‌ టెన్‌ హాగ్‌తో పాటు క్లబ్‌కు చెందిన మరో ముగ్గురు కలిసి నన్ను దారుణంగా అవమానించారు.  నాకు ద్రోహం చేసిన ఫీలింగ్‌ కలిగింది. అంతేకాదు మాంచెస్టర్‌ యునైటెడ్‌లో ఉండకూడదని కంకణం కట్టుకున్నారు. ఇప్పుడే కాదు గతేడాది కూడా ఇలాగే చేశారు. టెన్‌హగ్‌పై నాకు ఎలాంటి గౌరవం లేదు.. ఎందుకంటే ఆయనకు నాపై గౌరవం లేదు  కాబట్టి.'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: ఆసుపత్రిలో చేరిన క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement