పార్లమెంట్‌ ఎన్నికల బరిలో షకీబ్‌ | Cricketer Shakib Al Hasan to contest in Bangladesh polls | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ ఎన్నికల బరిలో షకీబ్‌

Published Tue, Nov 28 2023 4:21 AM | Last Updated on Tue, Nov 28 2023 10:21 AM

Cricketer Shakib Al Hasan to contest in Bangladesh polls - Sakshi

బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్, కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. త్వరలో జరిగే బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో అతను పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్‌ తరఫున అతను బరిలోకి దిగుతాడు. తన స్వస్థలమైన మగురా–1 నియోజకవర్గానికి సంబంధించి షకీబ్‌కు టికెట్‌ ఖరారైంది.

జనవరి 7న బంగ్లాలో ఎన్నికలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో వేలికి గాయమైన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న షకీబ్‌ మళ్లీ ఎప్పుడు మైదానంలోకి దిగుతాడనేదానిపై స్పష్టత లేదు. ఎన్నికల్లో బిజీగా ఉండే నేపథ్యంలో త్వరలో న్యూజిలాండ్‌తో ఇంటా, బయటా జరిగే వరుస సిరీస్‌లకు అతను అందుబాటులో ఉంటాడా అనేది చెప్పలేదు.

షకీబ్‌కు ముందు అతని సహచర ఆటగాడు, మాజీ కెపె్టన్‌ మష్రఫ్‌ మొర్తజా గత ఎన్నికల్లో నరైల్‌ స్థానంనుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఈ సారి కూడా అతను మళ్లీ బరిలో నిలిచాడు. మూడు ఫార్మాట్‌లో కలిపి బంగ్లా తరఫున 430 మ్యాచ్‌లు ఆడిన 14,406 పరుగులు చేయడంతో పాటు 690 వికెట్లు తీసిన షకీబ్‌ ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement