భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2027 సిరీస్ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. వచ్చే ఏడాది జనవరి 21న తొలి టెస్ట్ ఆడనుంది. ఈ మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరుగనుంది.
అనంతరం జనవరి 29 నుండి చెన్నై వేదికగా రెండో టెస్ట్.. ఫిబ్రవరి 11 నుండి గౌహతి వేదికగా మూడో టెస్ట్.. ఫిబ్రవరి 19 నుండి రాంచీ వేదికగా నాలుగో టెస్ట్.. ఫిబ్రవరి 27 నుండి అహ్మదాబాద్ వేదికగా ఐదో టెస్ట్ ఆడనుంది.
కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2027 తేదీల ప్రకటనతో పాటు భారత పర్యటనలోని మరిన్ని సిరీస్‌ల వివరాలను కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. బీజీటీ 2027కు ముందు ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత ఏ జట్టుతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది.
అలాగే ఆస్ట్రేలియా మహిళల ఏ జట్టు, పురుషుల అండర్-19 జట్టు కూడా సంబంధిత జట్లతో మల్టీ ఫార్మాట్ సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది.
ఆస్ట్రేలియా-ఏతో సిరీస్
సెప్టెంబర్ 22- తొలి మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)
సెప్టెంబర్ 29- రెండో మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)
అక్టోబర్ 6- తొలి వన్డే (పుదుచ్చేరి)
అక్టోబర్ 9- రెండో వన్డే (పుదుచ్చేరి)
అక్టోబర్ 11- మూడో వన్డే (పుదుచ్చేరి)
అండర్-19 జట్టుతో సిరీస్
భారత అండర్-19 జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు ఆడనుంది.
సెప్టెంబర్ 18- తొలి వన్డే (రాజ్‌కోట్)
సెప్టెంబర్ 21- రెండో వన్డే (రాజ్‌కోట్)
సెప్టెంబర్ 23- మూడో వన్డే (రాజ్‌కోట్)
సెప్టెంబర్ 27- తొలి మల్టీ డే మ్యాచ్ (రాజ్‌కోట్)
అక్టోబర్ 5- రెండో మల్టీ డే మ్యాచ్ (అహ్మదాబాద్)
మహిళల ఏ జట్టుతో సిరీస్
ఆస్ట్రేలియా జట్టుతో భారత మహిళల ఏ జట్టు సెప్టెంబర్‌లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (సెప్టెంబర్ 12, 15, 17-మొహాలి), 3 వన్డేలు (20, 23, 25- ధర్మశాల), ఓ మల్టీ డే మ్యాచ్ (29- ధర్మశాల) జరుగనున్నాయి.


