Sherfane Rutherford Throws Helmet In Frustration After Runout - Sakshi
Sakshi News home page

CPL 2021: వార్నీ.. కోపాన్నంత హెల్మెట్‌పై చూపించాడు

Sep 6 2021 10:19 AM | Updated on Sep 6 2021 3:21 PM

CPL 2021: Sherfane Rutherford Throws Helmet Frustration After Run Out - Sakshi

సెంట్‌కిట్స్‌: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌ 2021)లో మ్యాచ్‌లు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆదివారం సెంట్‌ కిట్స్‌, సెంట్‌ లూసియాల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో​ సెంట్‌ లూసియా ఘన విజయాన్ని అందుకుంది. అయితే సెంట్‌ కిట్స్‌ బ్యాట్స్‌మన్‌ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ఔటయ్యానన్న కోపాన్ని ఎవరిపై చూపించాలో తెలియక తన హెల్మెట్‌పై చూపించాడు.

ఇన్నింగ్స్‌ 10వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. 10వ ఓవర్‌ రెండో బంతిని రూథర్‌ఫోర్డ్‌ మిడాన్‌ దిశగా ఆడాడు. సింగిల్‌ పూర్తి చేసి రెండో పరుగుకు పిలవగా.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న ఆసిఫ్‌ అలీ వద్దని వారించాడు. అప్పటికే రూథర్‌ఫోర్ట్‌ క్రీజు దాటి భయటకు వచ్చేశాడు. దీంతో రోస్టన్‌ చేజ్‌ మెరుపువేగంతో రనౌట్‌ చేశాడు. మ్యాచ్‌లో 14 పరుగులు మాత్రమే చేసి అనూహ్యంగా రనౌట్‌గా వెనుదిరిగిన రూథర్‌ఫోర్డ్‌ కోపంతో పెవిలియన్‌ బాట పట్టాడు. బౌండరీలైన్‌ వద్దకు రాగానే తలకున్న హెల్మెట్‌ తీసి కిందకు విసిరేశాడు. ఈ ఘటనతో అభిమానులు షాక్‌కు గురయ్యారు.

వాస్తవానికి లీగ్‌లో రూథర్‌ఫోర్డ్‌ మంచి ఆటతీరును కనబరుస్తున్నాడు.  ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 201 పరుగులతో టోర్నమెంట్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ బ్యాట్స్‌మన్‌ ఆసిఫ్‌ అలీ పొరపాటు వల్లే అనవసరంగా రనౌట్‌ అయ్యాననే బాధతో హెల్మెట్‌ను విసిరేసి ఉంటాడని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సీపీఎల్‌ టీ 20 నిర్వాహకులు ట్విటర్‌లో షేర్‌ చేయగా అది కాస్త వైరల్‌ అయింది. 

చదవండి: BAN Vs NZ: చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్‌.. పదేళ్లలో కివీస్‌కు రెండో విజయం

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సెంట్‌ కిట్స్‌ 19.3 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఫాబియన్‌ అలెన్‌ 34 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. సెంట్‌ లూసియా బౌలర్ల దాటికి ఏడుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌  చేసిన సెంట్‌ లూసియా 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. రోస్టన్‌ చేజ్‌ (51 పరుగులు, 38 బంతులు; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement