
రోమ్: యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. కొపెన్‌హగన్ వేదికగా డెన్మార్క్, ఫిన్‌లాండ్ జట్ల మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో అంతరాయం ఏర్పడింది. 42వ నిమిషంలో ఒక్కసారిగా డెన్మార్క్ ఆటగాడు క్రిస్టియాన్ ఎరిక్సన్ మైదానంలో కుప్పకూలిపోయాడు. అతన్ని వైద్య సబ్బంది ఆస్పత్రికి తీసుకువెళ్లారు. క్రిస్టియన్ కుప్పకూలడంతో మ్యాచ్‌ను రిఫరీలు రద్దుచేశారు.
ఇక క్రిస్టియన్ ఎరిక్సన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అతను స్పృహలోకి వచ్చాడని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. క్రిస్టియన్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు, క్రీడా ప్రముఖలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.
చదవండి: ఇటలీ శుభారంభం