
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 పునఃప్రారంభానికి సర్వం సిద్దమైంది. మే 17వ తేదీ నుంచి క్యాష్ రిచ్ లీగ్‌లోని మిగిలిన మ్యాచులు మొదలవనున్నాయి. అయితే ఐపీఎల్ పునఃప్రారం వేళ గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్.. జాతీయ విధుల కారణంగా ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల కారణంగా స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్..తిరిగి ఐపీఎల్‌లో పాల్గోనేందుకు రావడం లేదు. ఈ విషయాన్ని బట్లర్ ఇప్పటికే గుజరాత్ ఫ్రాంచైజీకి తెలియజేశాడు. వెస్టిండీస్‌తో త్వరలో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ జట్టులో బట్లర్ సభ్యునిగా ఉన్నాడు.
మే 29 నుంచి ఇంగ్లండ్ జట్టు విండీస్ పర్యటన ప్రారంభం కానుంది. కాగా తొలుత బట్లర్ ఐపీఎల్‌లో ఆడేందుకు తిరిగి భారత్‌కు వస్తాడని, ప్లే ఆఫ్స్‌కు మాత్రమే దూరం కానున్నడాని వార్తలు వినిపించాయి. కానీ పూర్తిగా ఇప్పుడు మిగిలిన సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. జోస్ బట్లర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
ఈ ఏడాది సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన బట్లర్..71.43 సగటుతో 500 పరుగులు చేశాడు. ప్లే ఆఫ్స్‌కు ముందు బట్లర్ దూరం కావడం గుజరాత్‌కు గట్టి ఎదురు దెబ్బగానే చెప్పాలి. గుజరాత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది. టైటాన్స్‌కు ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు గిల్ సేన తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.
గుజరాత్ జట్టులోకి స్టార్ ప్లేయర్..
ఇక గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం బట్లర్ స్ధానాన్ని శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండీస్‌తో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ శ్రీలంక క్రికెటర్ పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. అయితే పీఎస్ఎల్ తాత్కాలికంగా వాయిదా పడడంతో మెండిస్‌తో గుజరాత్ టైటాన్స్‌తో జతకట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2025 Resumption: ఢిల్లీ క్యాపిటల్స్‌పై దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు