వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. టికెట్ల బుకింగ్ ఎప్పటినుంచంటే? | Booking Of Tickets For Delhi Capitals Match In Vizag Starts From March 24, Check Timing And Other Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024 Online Tickets: వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. టికెట్ల బుకింగ్ ఎప్పటినుంచంటే?

Published Sat, Mar 23 2024 8:47 PM

Booking of tickets for Delhi Capitals match in Vizag starts from March 24 - Sakshi

ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ తొలి రెండు హోం మ్యాచ్‌ల‌ను వైజాగ్‌లోని ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఆడనున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లకు సంబంధించి టిక్కెట్ల విక్రయాలపై ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన చేసింది.

ఈ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి హోం మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది.

ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఆదివారం(మార్చి 24) అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా ఈ నెల 31న ఢిల్లీ క్యాపిటల్స్‌– చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు 27వ తేదీ నుంచి టిక్కెట్ల అమ్మకం ప్రారంభం  కానుంది. .కాగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్లను పీఎం పాలెంలో ఉన్న స్టేడియం ‘బి’ గ్రౌండ్, నగరంలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడెమ్షన్‌ కౌంటర్లలో ఫిజికల్ టిక్కెట్లను పొందాలి.  

రూ. 7,500, రూ. 5,000, రూ. 3,500, రూ. 3,000, రూ. 2,500, రూ. 2,000, రూ. 1,500, రూ. 1,000 విలువ చేసే టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. కాగా ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో 4 వి​కెట్ల తేడాతో ఓటమి పాలైంది.
 

Advertisement
 
Advertisement