
మాడ్రిడ్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మాజీ చాంపియన్, మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా) కరోనా వైరస్ బారిన పడింది. ఈనెల 29 నుంచి జరిగే మాడ్రిడ్ ఓపెన్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. మాడ్రిడ్‌కు బయలుదేరేముందు నిర్వహించిన రెండు పరీక్షల్లో 20 ఏళ్ల ఆండ్రెస్కూకు నెగెటివ్ రాగా... మాడ్రిడ్‌లో అడుగుపెట్టాక పాజిటివ్ రావడంతో టోర్నీ నుంచి వైదొలిగింది.
చదవండి: World Chess Championship: కార్ల్‌సన్ ప్రత్యర్థి అతడే!