
ఛాతి నొప్పితో మైదానాన్ని వీడిన శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్(PC: Crickinfo)
మ్యాచ్ జరుగుతుండగానే మెండిస్‌కు ఛాతి నొప్పి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు సందర్భంగా శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. లంక స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్ ఛాతిలో నొప్పితో మైదానాన్ని వీడాడు. నొప్పి తీవ్రతరం కావడంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను ఢాకాలోని ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం.
కాగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం లంక బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్టు డ్రాగా ముగియగా.. సోమవారం (మే 23) రెండో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మ్యాచ్ 23వ ఓవర్ సమయంలో 27 ఏళ్ల కుశాల్ ఛాతి నొప్పితో విలవిల్లాడాడు.
దీంతో వెంటనే అతడిని మైదానం వెలుపలికి తీసుకువెళ్లారు. శ్రీలంక జట్టు ఫిజియో మెండిస్ పరిస్థితిని పరిశీలించాడు. ఆ తర్వాత అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. తొలి రోజు ఆటలో భాగంగా 60 ఓవర్లలో బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. బ్యాటింగ్ కొనసాగిస్తోంది.
చదవండి👉🏾Ind Vs SA: వాళ్లందరికీ అవకాశం.. మీరు పశ్చాత్తాపపడక తప్పదు: టీమిండియా మాజీ బ్యాటర్
చదవండి👉🏾Umran Malik: టీమిండియాలో ఉమ్రాన్.. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఆసక్తికర ట్వీట్