IND vs BAN: అ‍‍య్యో బంగ్లాదేశ్‌.. 5 పరుగుల పెనాల్టీ! ఎందుకంటే?

Ball hits helmet of Bangladesh wicketkeeper, india awarded 5 penalty runs - Sakshi

ఛాటోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 404 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఛతేశ్వర్‌ పుజారా(90), శ్రేయస్‌ అయ్యర్‌(86), అశ్విన్‌(58) పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తైజుల్ ఇస్లాం, మెహిదీ హసన్ మిరాజ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఎబాడోత్ హుస్సేన్, ఖలీల్‌ ఆహ్మద్‌ తలా వికెట్‌ సాధించారు.

ఇక ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బం‍గ్లా వికెట్‌ కీపర్‌ నూరల్‌ హసన్‌ చేసిన చిన్న తప్పిదం వల్ల భారత్‌కు ఐదు పరుగులు లభించాయి.

ఏం జరిగిందంటే?
భారత్‌ ఇన్నింగ్స్‌ 112 ఓవర్‌ వేసిన తైజుల్‌ ఇస్లాం బౌలింగ్‌లో.. అశ్విన్‌ థర్డ్‌మ్యాన్‌ దిశగా ఆడాడు. ఈ క్రమంలో ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న యాసిర్‌ అలీ బంతి కోసం పరిగెత్తుతూ వెళ్లి అక్కడ నుంచి త్రో వికెట్‌ కీపర్‌ వైపు చేశాడు. అయితే అతడు త్రో చేసిన బంతి నేరుగా వికెట్‌ కీపర్‌ హెల్మెట్‌ను తాకింది. దాంతో నిబంధనల ప్రకారం టీమిండియాకు అంపైర్‌ 5 అదనపు పరుగులు అందించాడు.

చదవండి: IND Vs BAN: రాణించిన పుజారా, శ్రేయస్‌.. 404 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top