కొకినాకిస్‌–కిరియోస్‌ జంటకు డబుల్స్‌ టైటిల్‌ | Sakshi
Sakshi News home page

కొకినాకిస్‌–కిరియోస్‌ జంటకు డబుల్స్‌ టైటిల్‌

Published Sun, Jan 30 2022 5:44 AM

Australian Open: Nick Kyrgios and Thanasi Kokkinakis Win Mens Doubles Title - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ థనాసి కొకినాకిస్‌–నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా) జంట ఖాతాలోకి వెళ్లింది. శనివారం జరిగిన ఫైనల్లో కొకినాకిస్‌–కిరియోస్‌ ద్వయం 7–5, 6–4తో ఎబ్డెన్‌–పర్సెల్‌ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సాధించింది. ‘వైల్డ్‌ కార్డు’ ద్వారా బరిలోకి ఈ టోర్నీ చరిత్రలో డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన జోడీగా కొకినాకిస్‌–కిరియోస్‌ చరిత్ర సృష్టించింది.

Advertisement
 
Advertisement