
రోమ్: ఏటీపీ రోమ్ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు సుమీత్ నగాల్ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో మెరుగైన స్థానిక ప్రత్యర్ధిని ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన ప్రపంచ 347వ ర్యాంకర్ నగాల్ 6–2, 6–4 స్కోరుతో ఇటలీ ప్లేయర్, ప్రపంచ 172వ ర్యాంకర్ ఫ్రాన్సెస్కో మాసరెలీపై విజయం సాధించాడు.
1 గంటా 24 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో నగాల్ ఒక్క ఏస్ కూడా కొట్టలేదు. అయితే తన చక్కటి సర్వీస్‌తో ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా లేకుండా చూసుకున్నాడు. ఇటలీ ఆటగాడు 3 ఏస్‌లు సంధించినా...6 డబుల్‌ఫాల్ట్‌లతో ఓటమిని ఆహ్వానించాడు.