
అస్తానా (కజకిస్తాన్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజే భారత్ నాలుగు పతకాలతో అదరగొట్టింది. పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్ పాల్ సింగ్ తూర్ పసిడి పతకం గెలిచాడు. తజీందర్ ఇనుప గుండును 19.49 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.
కరణ్‌వీర్ సింగ్ 19.37 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి భారత్‌కు రజతం అందించాడు. ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ 16.98 మీటర్ల దూరం గెంతి జాతీయ ఇండోర్ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం సాధించాడు. మహిళల పెంటాథ్లాన్‌లో స్వప్నా బర్మాన్ 4119 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది.