Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌.. డీకే, అశ్విన్‌ వద్దు! అతడు ఉంటేనే బెటర్‌!

Asia Cup 2022 Ind Vs Pak: Aakash Chopra Picks India Probable XI Left DK - Sakshi

క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా టోర్నీ ఆసియా కప్‌-2022 ఆగష్టు 27న ఆరంభం కానుంది. దుబాయ్‌ వేదికగా గ్రూప్‌- బిలోని శ్రీలంక, అఫ్గనిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఆ మరుసటి రోజే.. క్రికెట్‌ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగనుంది.

డీకే వద్దు!
ఈ క్రమంలో టోర్నీ టీ20 వరల్డ్‌కప్‌-2021లో గతేడాది దాయాది జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్‌ శర్మ సేన సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆసియా కప్‌-2022కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌కు తుది జట్టును అంచనా వేశాడు. ఈ రసవత్తర మ్యాచ్‌ ఆడే జట్టులో అతడు వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌కు చోటివ్వలేదు.

అందుకే హుడా ఉండాలి!
ఈ మేరకు యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ తన జట్టు ఎంపిక గురించి వివరాలు వెల్లడించాడు. ‘‘టాపార్డర్‌లో రోహిత్‌ శర్మ.. కేఎల్‌ రాహుల్‌.. విరాట్‌ కోహ్లి.. రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ మిడిలార్డర్‌లో ఆడాలి. ఆరోస్థానంలో హార్దిక్‌ పాండ్యా ఉండనే ఉన్నాడు. ఇక లోయర్‌ ఆర్డర్‌లో దినేశ్‌ కార్తిక్‌కు చోటు దక్కకపోవచ్చు.

ఎందుకంటే.. దీపక్‌ హుడా రూపంలో బ్యాట్‌తో.. బాల్‌తో రాణించగల ఆటగాడు ఉన్నాడు’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ఇక కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన నేపథ్యంలో.. ‘‘పాకిస్తాన్‌తోనే టోర్నీలో తొలి మ్యాచ్‌.. కేఎల్‌ రాహుల్‌ చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. విరాట్‌ కోహ్లి సైతం బ్రేక్‌ తర్వాత ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ పరిణామాల క్రమంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఒకవేళ కుప్పకూలితే.. దీపక్‌ హుడా రూపంలో చక్కని ప్రత్యామ్నాయం ఉంటుంది’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. అదే విధంగా బౌలింగ్‌ విభాగంలో స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు కూడా ఆకాశ్‌ చోప్రా చోటివ్వలేదు. అతడికి బదులు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో పాటు లెగ్‌ స్పిన్నర్‌ చహల్‌కు స్థానం కల్పించాడు.

ఆసియా కప్‌-2022లో పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్‌కు ఆకాశ్‌ చోప్రా ఎంచుకున్న జట్టు:
రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, దీపక్‌ హుడా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌. 
చదవండి: Asia Cup 2022 India Squad: అతడిని ఎంపిక చేయాల్సింది.. నేనే గనుక సెలక్టర్‌ అయితే..: మాజీ కెప్టెన్‌
CWG 2022: పతకాల పట్టికలో 58 దేశాలు ఆమె వెనకే..!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top