Ashes 2021-22 Adelaide Test: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్.. 275 పరుగుల తేడాతో విజయం

Australia Win 2nd Test Beat England: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అడిలైడ్ మ్యాచ్‌లో 275 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి జయకేతనం ఎగురవేసింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది. సెంచరీ వీరుడు మార్నస్ లబుషేన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా అతడు 154 పరుగులు సాధించాడు.
కాగా మొదటి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అడిలైడ్ టెస్టుకు దూరం కాగా... మాజీ సారథి స్టీవ్ స్మిత్ జట్టును ముందుండి నడిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆది నుంచి ఆధిపత్యం కనబరిచిన కంగారూలు... ఎట్టకేలకు విజయం సాధించి ఇంగ్లండ్‌కు చేదు అనుభవం మిగిల్చారు. పర్యాటక జట్టులో డేవిడ్ మలన్, కెప్టెన్ జో రూట్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జోస్ బట్లర్ 207 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేశాడు.
రెండో టెస్టు- స్కోర్లు:
►ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 473-9 డిక్లేర్డ్
►రెండో ఇన్నింగ్స్: 230-9 డిక్లేర్డ్
►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 236-10 ఆలౌట్
►రెండో ఇన్నింగ్స్: 192 ఆలౌట్
చదవండి: Ashes 2021-22: తదుపరి 3 టెస్టులకు కూడా.. ఇక: ఆస్ట్రేలియా
What a way to end an epic innings! 😲
That's the first time Buttler has been dismissed hit wicket in his 193-innings first class career #Ashes pic.twitter.com/nRP09djjay
— cricket.com.au (@cricketcomau) December 20, 2021
No, this clip is not in slow motion 😅#Ashes pic.twitter.com/Df3Xchcfuq
— cricket.com.au (@cricketcomau) December 20, 2021
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు