న్యూఢిల్లీ: జాతీయ కార్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఢిల్లీకి చెందిన 9 ఏళ్ల అర్షి గుప్తా విజేతగా నిలిచింది. తద్వారా ఈ టైటిల్ అందుకున్న తొలి అమ్మాయిగా కొత్త ఘనత సాధించింది. బెంగళూరులో జరిగిన ఈ పోటీల్లో మిక్స్‌డ్ గ్రిడ్ మైక్సో మ్యాక్స్ క్లాస్‌లో అర్షి పోటీ పడింది. 8–12 ఏళ్ల వయసు ఉన్న రేసర్ల కోసం జరిగిన మైక్రో మ్యాక్స్ క్లాస్‌లో ఆమె ప్రిఫైనల్, ఫైనల్ రేస్‌లలో గెలిచింది.
నేషనల్ కార్టింగ్ లైసెన్స్ పొందిన అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందిన అర్షి ఏడాది క్రితమే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. నిలకడగా రాణిస్తూ మద్రాస్ ఇంటర్నేషనల్ కార్టింగ్ రౌండ్ 3లో విజయం, ఆ తర్వాత కోయంబత్తూర్‌లో డబుల్ సాధించింది. సెపె్టంబర్‌లో శ్రీలంకలో జరిగిన ఆసియా పసిఫిక్ మోటార్‌స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో కూడా నాలుగో స్థానంలో నిలిచింది.


