breaking news
Karting Championship
-
తొమ్మిదేళ్లకే... జాతీయ కార్టింగ్ చాంపియన్‌గా అర్షి
న్యూఢిల్లీ: జాతీయ కార్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఢిల్లీకి చెందిన 9 ఏళ్ల అర్షి గుప్తా విజేతగా నిలిచింది. తద్వారా ఈ టైటిల్ అందుకున్న తొలి అమ్మాయిగా కొత్త ఘనత సాధించింది. బెంగళూరులో జరిగిన ఈ పోటీల్లో మిక్స్డ్ గ్రిడ్ మైక్సో మ్యాక్స్ క్లాస్‌లో అర్షి పోటీ పడింది. 8–12 ఏళ్ల వయసు ఉన్న రేసర్ల కోసం జరిగిన మైక్రో మ్యాక్స్ క్లాస్‌లో ఆమె ప్రిఫైనల్, ఫైనల్ రేస్‌లలో గెలిచింది. నేషనల్ కార్టింగ్ లైసెన్స్ పొందిన అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందిన అర్షి ఏడాది క్రితమే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. నిలకడగా రాణిస్తూ మద్రాస్ ఇంటర్నేషనల్ కార్టింగ్ రౌండ్ 3లో విజయం, ఆ తర్వాత కోయంబత్తూర్‌లో డబుల్ సాధించింది. సెపె్టంబర్లో శ్రీలంకలో జరిగిన ఆసియా పసిఫిక్ మోటార్‌స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో కూడా నాలుగో స్థానంలో నిలిచింది. -
విజేతలు కృష్ణరాజ్, డానిసన్
యశ్‌కు మైక్రోమ్యాక్స్ టైటిల్ జాతీయ కార్టింగ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: జేకే టైర్-ఎఫ్ఎంఎస్సీఐ జాతీయ రోటక్స్ కార్టింగ్ చాంపియన్‌షిప్‌లో కృష్ణరాజ్ మహాదిక్, రికీ ఆర్. డానిసన్, యశ్ ఆరాధ్య టైటిల్స్ సాధించారు. సీనియర్ మ్యాక్స్ విభాగంలో మోహిత్ రేసింగ్ డ్రైవర్ కృష్ణరాజ్ విజేతగా నిలువగా, జూనియర్ మ్యాక్స్‌లో బీపీసీ డ్రైవర్ రికీ డానిసన్ చాంపియన్‌గా నిలిచాడు. మైక్రోమ్యాక్స్ ఈవెంట్లో మెకో రేసింగ్ డ్రైవర్ యశ్ ఆరాధ్య గెలుపొందాడు. శంషాబాద్ విమానాశ్రయంలోని కార్టింగ్ ట్రాక్‌పై రెండో రౌండ్ పోటీలు ఆదివారం ముగిశాయి. ముందుగా జరిగిన మైక్రోమ్యాక్స్ ఫైనల్ రేస్‌లో అందరికంటే ముందుగా యశ్ (బెంగళూరు) పోటీని 12 నిమిషాల 11.002 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. రెండు సెకన్ల తేడాతో సాహా అలీ మోసిన్ (12:13.785 సె.; ఆగ్రా) రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. బీపీసీ డ్రైవర్ చిరాగ్ ఘోర్పడే (12:13.933 సె.; బెంగళూరు) మూడో స్ధానం పొందాడు. అనంతరం జూనియర్ మ్యాక్స్ కేటగిరీలో బెంగళూరు రేసర్ రికీ ఆర్. డానిసన్ (బీపీసీ) సత్తా చాటాడు. రేయో రేసింగ్ డ్రైవర్, ముంబై కుర్రాడు ఆరోహ్ రవీంద్ర నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ రికీ పోటీని 16 నిమిషాల 01.613 సెకన్లలో పూర్తి చేసి టైటిల్ సాధించాడు. కేవలం 0.015 సెకన్ల తేడాతో ఆరోహ్ రవీంద్ర (16:01.628 సె.) రన్నరప్‌గా నిలిచాడు. డార్క్ డాన్ డ్రైవర్ కుశ్ మైని (16:02.243 సె.; బెంగళూరు) కాంస్య పతకం గెలుచుకున్నాడు. సీనియర్ మ్యాక్స్ విభాగంలో కొల్హాపూర్‌కు చెందిన కృష్ణరాజ్ మహాదిక్ (మోహిత్ రేసింగ్) రేస్‌ను 18 నిమిషాల 38.865 సెకన్లలో పూర్తి చేసి చాంపియన్‌గా నిలిచాడు.


