జెర్సీ 18.. జెర్సీ 22.. నిజంగా అద్బుతం | Amazing Coincidence Of WTC Final Dates With Virat Kohli Kane Williamson | Sakshi
Sakshi News home page

జెర్సీ 18.. జెర్సీ 22.. నిజంగా అద్బుతం

Mar 14 2021 12:32 PM | Updated on Mar 14 2021 1:27 PM

Amazing Coincidence Of WTC Final Dates With Virat Kohli Kane Williamson - Sakshi

అహ్మదాబాద్‌: జూన్‌ 18 నుంచి 22వరకు సౌతాంప్టన్‌లోని ఏగిస్‌ బౌల్‌ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో దక్కించుకొని డబ్ల్యూటీసీ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అనలిస్ట్‌ మోహన్‌దాస్‌ మీనన్.. విరాట్‌ కోహ్లి, కేన్‌ విలియమ్సన్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

''టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి జెర్సీ నెంబర్‌ 18.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ జెర్సీ నెంబర్‌.. 22. వీరిద్దరి జెర్సీలు పక్కపక్కన ఉంచితే 18-22గా కనిపిస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కూడా జూన్‌ 18న మొదలై 22న ముగియనుంది. వావ్‌ ఇది నిజంగా అద్భుతం.. కోహ్లితో ప్రారంభమై.. విలియమ్స్‌న్‌తో ముగుస్తుంది.'' అంటూ తెలిపాడు. మోహన్‌దాస్‌ చేసిన ఈ క్యాలిక్యులేషన్‌ వైరల్‌గా మారింది. ఇక టీమిండియా ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌ వేదికగా రెండో టీ20 ఆడనుంది. తొలి టీ20లో ఓటమిపాలైన టీమిండియా రెండో టీ20లో భారీ మార్పులతో బరిలోకి దిగనుంది.
చదవండి:
సన్యాసి అవతారంలో ధోని.. షాక్‌లో అభిమానులు

ఆ రూల్‌ నీకు కూడా వర్తిస్తుందా.. కోహ్లిపై ధ్వజమెత్తిన వీరూ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement