Ind vs Aus: Allan Border predicts Australia's XI for 2nd Test in Delhi - Sakshi
Sakshi News home page

IND vs AUS: భారత్‌తో రెండో టెస్టు.. 7 వికెట్ల స్పిన్నర్‌కు నో ఛాన్స్‌!

Feb 16 2023 2:10 PM | Updated on Feb 16 2023 3:02 PM

Allan Border predicts Australias XI for Delhi Test - Sakshi

ఢిల్లీ వేదికగా భారత్‌తో రెండో టెస్టులో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. తొలి టెస్టులో ఓటమికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ సమం చేయాలాని కమ్మిన్స్‌ సేన భావిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా నెట్‌ ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతోంది. ఇక కీలకమైన రెండో టెస్టు కోసం ఆసీస్‌ తుది జట్టును ఆ దేశ క్రికెట్‌ దిగ్గజం అలన్ బోర్డర్ అంచనా వేశాడు.

అయితే మొదటి టెస్ట్‌లో 7 వికెట్లతో చెలరేగిన టాడ్ మర్ఫీకి తను ఎంపిక చేసిన జట్టులో అలన్ బోర్డర్ చోటివ్వకపోవడం గమనార్హం. మర్ఫీ తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.

ఇక గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్, పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌కు బోర్డర్ తన ప్లేయింగ్‌లో అవకాశం ఇచ్చాడు. అదే విధంగా తొలి టెస్టులో దారుణంగా విఫలమైన మాట్‌ రెన్‌షా, స్కాట్‌ బోలాండ్‌ను కూడా బోర్డర్‌ ఎంపిక చేయలేదు. రెన్‌షా స్థానంలో ట్రావిస్ హెడ్‌కు ఆయన ఛాన్స్‌ ఇచ్చారు.

భారత్‌తో రెండో టెస్టుకు అలన్ బోర్డర్‌ ఎంచకున్న ఆసీస్‌ జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషేన్‌, స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్‌
చదవండి: IND vs AUS: 36 ఏళ్లుగా భారత్‌ చెక్కుచెదరని రికార్డు.. ఆస్ట్రేలియా బ్రేక్‌ చేస్తుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement