ఐపీఎల్‌కు ఆకాశ్‌దీప్‌ దూరం | Akash Deep Ruled Out of IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు ఆకాశ్‌దీప్‌ దూరం

Mar 22 2026 3:45 AM | Updated on Mar 22 2026 1:08 PM

Akash Deep Ruled Out of IPL

కోల్‌కతా: మూడుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో ఇప్పటికే పేస్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా ఈ మెగా టోర్నీకి దూరంకాగా... అతని సరసన మరో ఫాస్ట్‌ బౌలర్‌ ఆకాశ్‌దీప్‌ కూడా చేరాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న ఆకాశ్‌దీప్‌ కోలుకోవడానికి కనీసం ఎనిమిది నుంచి 12 వారాలు పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈనెల 28 నుంచి మొదలయ్యే ఐపీఎల్‌ 19వ సీజన్‌ నుంచి ఆకాశ్‌దీప్‌ తప్పుకున్నాడు. అఫ్గానిస్తాన్‌తో జూన్‌ తొలి వారంలో జరిగే ఏకైక టెస్టుకు కూడా ఆకాశ్‌దీప్‌ దూరమయ్యే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

బిహార్‌కు చెందిన 29 ఏళ్ల ఆకాశ్‌దీప్‌ దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారత్‌ తరఫున 10 టెస్టులు ఆడిన అతను 28 వికెట్లుపడగొట్టాడు. ఐపీఎల్‌లో 2022 నుంచి 2024 వరకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు ఆడిన ఆకాశ్‌దీప్‌ గత సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున బరిలోకి దిగాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆకాశ్‌దీప్‌ 10 వికెట్లు తీశాడు.  

Advertisement
 
Advertisement
Advertisement