Ajinkya Rahane Makes Comeback To Indian Team For WTC Final - Sakshi
Sakshi News home page

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు ప్రకటన.. ఐపీఎల్‌ హీరోకు పిలుపు

Apr 25 2023 11:47 AM | Updated on Apr 25 2023 11:58 AM

Ajinkya Rahane Make Comeback In Team India For WTC Final - Sakshi

లండన్‌లోని ఓవల్‌ వేదికగా ఈ ఏడాది జూన్‌ 7 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ ఫైనల్‌ కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్‌ 25) ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియా ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించిన సెలెక్టర్లు.. ఒక్క అనూహ్య మార్పు చేశారు. గాయపడిన శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో ఐపీఎల్‌-2023లో ఇరగదీస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ వెటరన్‌ బ్యాటర్‌ అజింక్య రహానేను ఎంపిక చేశారు. కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు మరో అవకాశం ఇచ్చారు. 

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ 2021-23 ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఉనద్కత్‌

Advertisement
 
Advertisement
Advertisement