IND vs NZ: పంత్‌కు గాయం.. కేఎల్ రాహుల్‌కు లక్కీ ఛాన్స్‌? | Ace keeper likely to get another chance if Rishabh Pant is injured | Sakshi
Sakshi News home page

IND vs NZ: పంత్‌కు గాయం.. కేఎల్ రాహుల్‌కు లక్కీ ఛాన్స్‌?

Oct 21 2024 3:49 PM | Updated on Oct 21 2024 5:11 PM

Ace keeper likely to get another chance if Rishabh Pant is injured

న్యూజిలాండ్‌తో జ‌రిగిన‌ తొలి టెస్టులో అనుహ్యంగా ఓట‌మి చ‌విచూసిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్ద‌మ‌వుతోంది. ఆక్టోబ‌ర్ 24 నుంచి పుణే వేదిక‌గా భార‌త్‌-కివీస్ మ‌ధ్య సెకెండ్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ను ఓడించి సిరీస్‌ను 1-1తో స‌మం చేయాల‌ని భార‌త జ‌ట్టు భావిస్తోంది.

అయితే ఈ పుణే టెస్టుకు భార‌త స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్‌పై వేటు ప‌డ‌నున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగుతోంది. బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టులో రాహుల్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల‌లో క‌లిపి 12 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని సెకెండ్ టెస్టుకు ప‌క్క‌న పెట్టాల‌ని ప‌లువురు మాజీలు కూడా డిమాండ్ చేస్తున్నారు.

రాహుల్‌కు మ‌రో ఛాన్స్‌..?
అయితే భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్ మాత్రం రాహుల్‌కు మ‌రో ఛాన్స్ ఇవ్వాల‌ని భావిస్తుందంట‌. మొద‌టి టెస్టులో గాయప‌డిన స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్.. పుణే టెస్టుకు దూరమయ్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో రాహుల్‌కు వికెట్ కీపింగ్ బాధ్య‌త‌లు అప్ప‌గించి, పంత్ స్ధానంలో ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ లేదా అక్ష‌ర్ ప‌టేల్‌ను ఆడించాల‌ని హెడ్‌కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఒక వేళ రెండో టెస్టులో కూడా రాహుల్ విఫ‌ల‌మైతే క‌చ్చితంగా మూడో టెస్టుకు వేటు ప‌డే ఛాన్స్ ఉంది.

తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్‌, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/  వాషింగ్టన్‌ సుందర్‌, మహమ్మద్ సిరాజ్, జ‌స్ప్రీత్ బుమ్రా.
చదవండి: BAN vs SA: చరిత్ర సృష్టించిన రబాడ.. ప్రపంచ రికార్డు బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement