రిటైర్మెంట్‌కు ముందు సానియా మీర్జాకు పరాభవం | Abu Dhabi Open: Sania Mirza Suffers Disappointing Defeat In Penultimate Tournament | Sakshi
Sakshi News home page

Abu Dhabi Open: రిటైర్మెంట్‌కు ముందు సానియా మీర్జాకు పరాభవం

Feb 7 2023 9:30 AM | Updated on Feb 7 2023 9:30 AM

Abu Dhabi Open: Sania Mirza Suffers Disappointing Defeat In Penultimate Tournament - Sakshi

రిటైర్మెంట్‌కు ముందు జరిగిన అబుదాబి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ-2023లో భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాకు పరాభవం ఎదురైంది. ఈ టోర్నీలో బెథానీ మాటెక్‌ (అమెరికా)తో బరిలోకి దిగిన హైదరాబాదీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించి అబాసుపాలైంది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా–బెథానీ ద్వయం 3–6, 4–6తో ఫ్లిప్‌కెన్స్‌ (బెల్జియం)–లౌరా సిగెముండ్‌ (జర్మనీ) జోడీ చేతిలో ఓడింది.

73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ తమ సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయింది. సానియా–బెథానీలకు 4,350 డాలర్లు (రూ. 3 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. కాగా, ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్న దుబాయ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌తో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు సానియా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement