Bhagwani Devi Dagar: 95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లో అద్భుతాలు

95-year-old Bhagwani Devi Wins 3 Golds-World Master Athletics Tourmey - Sakshi

ఇండియాకు చెందిన భగవానీ దేవి డాగర్‌ 95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లో అద్భుతాలు చేస్తోంది. వ‌య‌సు పెరుగుతున్నా..మెడ‌ల్స్ కొట్టాల‌న్న ఆమె ఆకాంక్ష మరింత ఎక్కువైంది. తాజాగా పోలాండ్‌లోని టొరున్‌లో జ‌రిగిన తొమ్మిదో వ‌ర‌ల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియ‌న్‌షిప్‌(World Master Athletics Indoor Championship)లో స‌త్తా చాటింది. 60 మీట‌ర్ల ర‌న్నింగ్‌, షాట్‌పుట్‌, డిస్క్‌త్రో ఈవెంట్స్‌లో భ‌గ‌వానీ దేవి డాగర్‌ స్వర్ణ పతకాలు సాధించింది.ఈ బామ్మ గ‌తేడాది కూడా వ‌ర‌ల్డ్ మాస్టర్‌ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియ‌న్‌షిప్‌లో మెడ‌ల్స్ సాధించింది. 2022లో ఒక గోల్డ్‌, రెండు బ్రాంజ్ మెడ‌ల్స్‌ గెలుచుకుంది. 

హర్యానాలోని ఖేడ్‌కా గ్రామానికి చెందిన భగవానీ దేవి డాగర్‌కు 12 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. 30 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయింది.  ఆ తర్వాత రెండో వివాహం చేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. అప్పటికే తన నాలుగేళ్ల కూతురు, కడుపులో పెరుగుతున్న మరో బిడ్డ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నాలుగేళ్ల తర్వాత అనారోగ్యం తన ఎనిమిదేళ్ల కూతురిని బలి తీసుకుంది.

అయితే తాను ధైర్యం కోల్పోకుండా కూలీ, ‍వ్యవసాయ పనులు చేసి కొడుకును పెంచి పెద్ద చేసింది. ఆమె కొడుక్కి ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో క్లర్క్‌గా ప్రభుత్వం ఉద్యోగం రావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగైంది. కొడుక్కి పెళ్లి చేసిన అనంతరం అథ్లెటిక్స్‌పై దృష్టి సారించింది. అక్కడి నుంచి తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ వచ్చిన ఆమె 80 ఏళ్ల వయసులో తొలిసారి 100 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొంది.

అక్కడినుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ తాజాగా 95 ఏళ్ల వయసులో మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఇక భగవానీ దేవి పెద్ద మనుమడు వికాస్‌ డాగర్‌ పారా అథ్లెట్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటికే అథ్లెటిక్స్‌లో ఎన్నో పతకాలు సాధించిన వికాస్‌ డాగర్‌ ఖేల్‌రత్న అవార్డు గెలుచుకున్నాడు.

చదవండి: 70 కోట్ల విలువైన కారు.. కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా?

'ఆడేది మెగాటోర్నీ.. అలా కుదరదు'; ప్లాన్‌ బెడిసికొట్టిందా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top