
ప్రపంచ చెస్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌కు ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల ఆరిత్ కపిల్ చెమటలు పట్టించాడు. మంగళవారం అర్ధరాత్రి ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో జరిగిన 'ఎర్లీ టైటిల్డ్ ట్యూస్‌డే' చెస్ టోర్నమెంట్‌లో కార్ల్‌సెన్‌ను ఆరిత్ ఓడించినంత పనిచేశాడు.
తొమ్మిదేళ్ల అరిత్ ఎత్తుల ముందు ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కార్ల్‌సెన్ తడబడ్డాడు. అయితే ఆఖరి రౌండ్‌లో సమయం దగ్గరపడుతుండంతో కపిల్ తనకు లభించిన అవకాశాన్ని ఉపయెగించుకోలేకపోయాడు. దీంతో గేమ్ డ్రాగా ముగిసింది.
ఆరిత్ ఈ ఈవెంట్‌లో జార్జియా నుంచి పాల్గోన్నాడు. అతడు ప్రస్తుతం జార్జియా వేదికగా జరుగుతున్న అండర్-10 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్నాడు. ఇప్పటికే రెండు రౌండ్లలో విజయం సాధించిన అరిత్..బుధవారం తన మూడవ గేమ్ ఆడనున్నాడు. అంతకుముందు అండర్-9 ప్రపంచ ఛాంపియన్‌షిప్ రన్నరప్‌గా ఆరిత్ నిలిచాడు.
మరోవైపు భారత్‌కు చెందిన వి. ప్రణవ్ 10 పాయింట్లతో ఈ 'ఎర్లీ టైటిల్డ్ ట్యూస్‌డే' టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ హాన్స్ మోక్ నీమాన్ , కార్ల్‌సెన్ ఇద్దరూ 9.5 పాయింట్లతో ముగించారు. కానీ టైబ్రేక్‌లో నీమాన్ రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు.
చదవండి: అనుభవం ఉండి ఏం లాభం?.. మరీ ఇలా ఆడతావా?: డీకే ఫైర్