కొమురవెల్లి(సిద్దిపేట): తపాసుపల్లి రిజర్వాయర్ భూములు కాపాడాలని మండలంలోని అయినాపూర్ గ్రామానికి చెందిన మత్స్యకారులు రిజర్వాయర్ కట్టపై సోమవారం ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ డీఈ అంజయ్య రెవెన్యూ అధికారులతో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని రిజర్వాయర్ భూములను పరిశీలించారు. కబ్జాకు గురైన భూమలను జేసీబీతో చదును చేసి హద్దులు ఏర్పాటు చేయడంతో ఆందోళన విరమించారు. ఎవరైనా రిజర్వాయర్ భూములు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తేలు ఇస్తారి, మల్లం బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
● మత్స్యకారుల ఆందోళన
● కబ్జాను తొలగించిన అధికారులు


